Begin typing your search above and press return to search.
#మెగా150 వెనక వ్యూహం.. కరెక్టేనా?
By: Tupaki Desk | 31 Dec 2016 11:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి మాస్ మసాలా మూవీ ఖైదీ నంబర్ 150తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయిపోవడంతో.. ఇక పొంగల్ రిలీజ్ కి అన్నీ సిద్ధమైపోయినట్లే. జనవరి4న విజయవాడ వేదికగా జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి.
అయితే.. చిరు ఇలా మాస్ ఎంటర్టెయినర్ ఉన్న మూవీ ఎంచుకోవడం వెనక కారణం ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మొదట స్టాలిన్ టైపులో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కోసం ఆలోచించారట చిరు టీం. అయితే.. ప్రజారాజ్యం ఫ్లాప్ కావడం.. ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడంతో పొలిటికల్ గా చిరు ఇమేజ్ దెబ్బ తిన్న మాట వాస్తవమే. అలాంటి టైంలో ఇంకా కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతూ ఉన్న సమయంలో మెసేజ్ లు ఇస్తే జనాలు విమర్శించే అవకాశం ఉంది. పైగా చిరు గ్యాప్ ఇచ్చిన టైమ్ లో పవన్ కళ్యాణ్.. మహేష్ బాబులు తమ క్రేజ్ విపరీతంగా పెంచేసుకున్నారు.
ఇప్పుడు చిరు రీఎంట్రీ అంటే.. ఆ స్థాయికి మించి ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ బాలయ్య తన 100వ మూవీగా గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చారిత్రక చిత్రాన్ని ఎంచుకుంటే.. చిరు మాత్రం 150వ సినిమాగా తనకు మెగాస్టార్ ఇమేజ్ అందించిన మాస్ మూవీనే నమ్ముకున్నారు. ఈ మూవీలో రైతులు.. నీటి సమస్యలపై మెసేజ్ ఉన్నా.. ఇది మాస్ జోనర్ లోకి వచ్చే మూవీనే. ఇప్పుడు ఖైదీ-శాతకర్ణిల మధ్య పోటీ తీవ్రంగా ఉన్న సమయంలో.. ఖైదీ సక్సెస్ సాధించగలిగితే చిరు అండ్ కో ప్లాన్ వర్కవుట్ అయినట్లే. తేడా వస్తే మళ్లీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషిస్తున్నారు సినీ జనాలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/