Begin typing your search above and press return to search.
వంద ఓకే.. మరి 150 సంగతేంటి ?
By: Tupaki Desk | 18 Jan 2016 7:52 AM GMTగత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో రెండు హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా అయితే.. రెండోది నందమూరి నటసింహం బాలకృష్ణ వందో సినిమా. మరి ఈ రెండింటిలో బాలయ్య సంగతి ఫైనల్ అయిపోయింది. ఆదిత్య 369 కి సీక్వెల్ చేయబోతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ సాక్షిగా బాలకృష్ణ చెప్పేశారు. మరి చిరు 150 సంగతేంటి?
నిజానికి బాలయ్య 97వ సినిమా లెజెండ్ రిలీజ్ కాక ముందు నుంచి.. చిరు 150 వార్తల్లో నానుతోంది. ఆ తర్వాత బాలయ్య లెజెండ్ - లయన్ - డిక్టేటర్ అంటూ 99వరకూ వచ్చేశారు. ఇప్పుడు వందోమూవీపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. కానీ చిరు మాత్రం ఇంకా ఒక్క మూవీపై తేల్చుకోలేకపోతున్నారు. నూటేభై ఉంది, కత్తి రీమేక్ చేయబోతున్నాం అంటూ.. అప్పుడెప్పుడో ఓసారి ఓ ఛానల్ కి చెర్రీ ఇచ్చిన ఇంటర్వ్యూ తప్ప.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు. డైరెక్టర్ వివి వినాయక్ అంటారు కానీ.. ఆయన కూడా ఏం చెప్పడం లేదు. నిర్మాతలుగా తమిళ ప్రొడక్షన్ కంపెనీ జాయిన్ అయిందనే వార్త కూడా లీకేజీనే తప్ప, అధికారికం కాదు.
ఇప్పటికైతే మెగాస్టార్ సినిమాని రామ్ చరణ్ బర్త్ డే అయిన మార్చ్ 27న ప్రకటించబోతున్నారన్నది న్యూస్. ఇలాంటి డేట్స్, డెడ్ లైన్స్ చాలానే అయిపోయాయి. బ్రూస్ లీ రిలీజ్ అప్పుడు చరణ్ చెబుతాడని చిరునే స్వయంగా అన్నారు. అయినా జరగలేదు. ఇప్పటికైనా చిరు 150పై ఫైనల్ డెసిషన్ తీసుకుని అనౌన్స్ చేయాలని.. మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి మెగా క్యాంప్ లో ఎవరికైనా ఇవి వినపడుతున్నాయో లేదో ?