Begin typing your search above and press return to search.
చిరు సినిమా ఈ యేడు కూడా డౌటే
By: Tupaki Desk | 20 April 2016 3:45 AM GMTమెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి అభిమానుల కళ్ళు కాయలు కాచి, పళ్ళుగా మారి ఆఖరికి పుచ్చిపోయి నెల రాలాయి. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటూ వచ్చే వార్తలకు కూడా అభిమానులు స్పందించడం మానేశారు. చివరికి రామ్ చరణ్ స్వయంగా కత్తి రీమేక్ లో నటిస్తున్నారని చెప్పడంతో ఒకింత ఊరట లభించింది.
అయితే ఇప్పటివరకూ ఇంకా అధికారిక ప్రకటన బయటకి రాకపోవడంతో తిరిగి అభిమానులు నీళ్ళువదిలేశారు. మరోపక్క బాలయ్య తన 100వ సినిమా కోసం ఇలానే తర్జన భర్జనలు పడ్డా చారిత్రాత్మక నేపధ్యాన్ని ఎంచుకుని తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. చిరు మాత్రం ఇంకా సందిగ్ధతలోనే వున్నట్టు సమాచారం.
కత్తి స్టోరీని తనకి సరిపోయే స్టైల్ లో డెవలప్ చేయమని ఆదేశించిన చిరుకి వినాయక్ డెవలప్ చేసిన ప్లాట్ నచ్చలేదని సమాచారం. అందుకే ఈ ప్రాజెక్ట్ ని పక్కనబెట్టే యోచనలో కూడా వున్నాడట. ఈ సినిమా కాకుండా వినాయక్ విడిగా చెప్పిన ఒక లైన్ నచ్చి దాన్ని డెవలప్ చేయమన్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా మరో నెల వరకూ మొదలయ్యే అవకాశాలు కనిపించడంలేదు. అంటే ఈ ఏడాది చిరు 150విడుదల కష్టమే