Begin typing your search above and press return to search.
151వ సినిమా.. ఆ రెండు స్ర్కిప్టుల్లో ఒకటి
By: Tupaki Desk | 9 Jan 2017 7:39 AM GMTఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించే కాదు.. ఆయన చేయబోయే 151వ సినిమా గురించి కూడా నానా హంగామాలు విన్నాం. నానా కథలు చెప్పుకున్నాం. ఆ మధ్యన అయితే ఆయన 151వ సినిమాను బోయపాటి శ్రీను లేదా త్రివిక్రమ్ డైరక్షన్లో చేయనున్నారని టాక్ వచ్చింది. ఇంతకీ ఇదంతా నిజమేనా? అసలు మెగాస్టార్ మైండ్లో ఉన్న కథలు ఏంటి? 151వ సినిమా ఎవరితో చేస్తున్నారు? వీటికి మెగాస్టారే సమాధానం చెప్పేశారు.
''నేను 150వ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను విన్నాను. అయితే ఆ కథను 151వ సినిమాగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. దర్శకుడు ఎవరనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు'' అన్నారు చిరంజీవి. గతంలో ఈ కథను బోయపాటి డైరక్ట్ చేస్తాడని రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ ఇంకో మాట కూడా చెప్పారండోయ్. ''అలాగే సురేందర్ రెడ్డి కూడా ఒక కథను చెప్పాడు. అది కూడా చాలా బాగుంది. ఆ కథను 151వ సినిమాగా చేస్తే ఎలా ఉంటుందని కూడా చూస్తున్నాను'' అంటూ చెప్పారు చిరు.
అంటే సురేందర్ రెడ్డి గతంలో ధృవ ప్రమోషన్ల టైములో చెప్పిన మెగా జాక్ పాట్ ఇదేననమాట. మనోడు బన్నీ రేసుగుర్రం.. చెర్రితో ధృవ వంటి హిట్లు కొట్టాక.. ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవిని డైరక్ట్ చేయడం అనేదే మైండ్ బ్లోయింగ్ ఛాన్స్ అనే చెప్పాలి. చూద్దాం మరి చిరంజీవి ఏ సినిమాను ముందుగా మొదలెట్టేస్తారో. ఇకపోతే కత్తి తమిళ వర్షన్ చూసినప్పుడు తెలుగులో ఎక్కుతుందా లేదా అనే సందేహం ఉన్నా కూడా.. ఇప్పుడు ఖైదీ నెం 150 కాపీ చూశాక ఆ డౌట్లు పటాపంచలు అయిపోయాయ్ అంట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/