Begin typing your search above and press return to search.
ఖైదీ తో మొదలైన పరిచయం ఆచార్య వరకు కొనసాగింది
By: Tupaki Desk | 29 Nov 2021 12:52 PM GMTప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో కన్ను మూసిన విషయం తెల్సిందే. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన కోవిడ్ బారిన పడటంతో ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు పలువురు ఆయన కుటుంబంకు ఆర్థికంగా అండగా నిలిచారు. శివ శంకర్ మాస్టర్ మళ్లీ కోలుకుని జనాల్లో తిరుగుతాడనే నమ్మకంను అంతా వ్యక్తం చేశారు. కాని కోవడ్ నుండి కోలుకున్న తర్వాత ఆయన ఇతర అనారోగ్య సమస్యల నుండి తేరుకోలేక పోయాడు. కోవిడ్ వల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్న శివ శంకర్ మాస్టర్ వయసు రీత్యా వాటిని జయించలేక పోయాడు. దాంతో ఆయన తుది శ్వాస విడిచినట్లుగా వైద్యులు తెలియజేశారు.
శివ శంకర్ మాస్టర్ మృతిపై పలువురు ప్రముఖులు స్పందించారు. రాజకీయ మరియు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఈ సందర్బంగా చిరంజీవి తనకు శివ శంకర్ మాస్టర్ తో ఉన్న అనుబంధం మరియు స్నేహం గురించి చెప్పుకొచ్చాడు. ఖైదీ సినిమా సమయంలో శివ శంకర్ మాస్టర్ తో నాకు పరిచయం అయ్యింది. ఆ సమయంలో మా స్నేహం మొదలైంది. అప్పటి నుండి కొనసాగుతూనే వచ్చింది. ఆచార్య సినిమా సెట్ లో కూడా ఇద్దరం కలిశాం. మేము ఇద్దరం ఎన్నో సినిమాల్లో కలిసి వర్క్ చేశామని చిరంజీవి చెప్పుకొచ్చాడు. శివశంకర్ మాస్టర్ మృతి నృత్య కళకే కాకుండా యావత్ సినీ లోకానికి కూడా తీరని లోటు అంటూ చిరంజీవి పేర్కొన్నాడు.
ఒక ఆప్తుడిని కోల్పోయాను అంటూ ఆయన కుటుంబంకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. చిరంజీవి కొన్ని రోజుల క్రితం శివ శంకర్ మాస్టర్ కొడుకును కలిసి ఆసుపత్రి అవసరాల కోసం కొంత మొత్తం ను ఇవ్వడం జరిగింది. ఆ సమయంలోనే చిరంజీవి మంచి మనసుకు అంతా కూడా ప్రశంసలు కురిపించారు. చిరంజీవి కరోనా నుండి తేరుకుని చిరంజీవి తో పాటు తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్తాడని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా ఆయన మృత్యు ఒడికి వెళ్లారు. ఇంకా ఎంతో మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శివ శంకర్ మాస్టర్ కు శ్రద్దాంజలి ఘటించారు.