Begin typing your search above and press return to search.
అబ్బాయ్ కోసం మెగాస్టార్?
By: Tupaki Desk | 14 Dec 2018 4:11 PM GMTఅబ్బాయ్ కి పెదనాన్న అంటే ఎంతో ఇష్టం. ఆయన స్ఫూర్తితోనే హీరో అయ్యాడు. కెరీర్ లో తొలి అడుగుల వేళ పెదనాన్న దీవెనలు తనకు ఎంతో పెద్ద ప్లస్ అయ్యాయి. అందుకే తన ప్రతి సినిమాకి పెదనాన్న ఆశీస్సులు ఉంటే బావుంటుందని ఆశిస్తాడట. ఇంతకీ ఎవరు ఆ హీరో? అంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించే. వరుణ్ కి బాబాయ్ పవన్ కల్యాణ్ .. పెదనాన్న చిరంజీవి అంటే విపరీతమైన ప్రేమాభిమానాలు - గౌరవం. అందుకే తన సినిమాలకు వాళ్ల దీవెనలు దక్కితే అదో గొప్ప అదృష్టంగా భావిస్తాడట.
వరుణ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం కెరీర్ పరంగా ఓ స్థాయికి వచ్చాడు. అయితే ఇది సరిపోదు. ఇంకో మెట్టు ఎక్కాల్సిన కీలక తరుణమిది. ఇక్కడ స్టార్ అనిపించుకుంటే సరిపోదు.. స్టారాధిస్టార్ గా ఎదిగితేనే బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా కాసులు కురుస్తాయి. అయితే అలా ఎదగాలంటే ఓవర్ నైట్ లో కుదిరేపనా? వారసత్వం అందుకు అక్కరకొస్తుందా? అంటే అవన్నీ విశ్లేషించుకుని వరుణ్ ఎంతో తెలివిగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడున్న నవతరం హీరోల్లో వేరొకరు చేయలేని ప్రయోగాలు చేస్తూ డార్లింగ్ హీరో అయిపోయాడు. అన్నట్టు డార్లింగ్ అంటే గుర్తుకొచ్చింది. టాలీవుడ్ లో ఆరడుగులు మించి ఉన్న నలుగురు హీరోల్లో వరుణ్ తేజ్ ఒకడు. ప్రభాస్ - మహేష్ - రానా తర్వాత అంతకుమించిన హైట్ యువహీరోల్లో వరుణ్ తేజ్ ఒక్కడే ఉన్నాడు. తన ఎత్తుకు తగ్గట్టే కెరీర్ లోనూ మరో ఎత్తుకు ఎదగాలన్న తపన అతడిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఏ ఇతర మెగా హీరోతో పోల్చినా కూడా మెగా ప్రిన్స్ సంథింగ్ స్పెషల్ అన్న ముద్ర వేయగలిగాడు.
అందుకే ఇప్పుడు తన కెరీర్ లో భారీ ప్రయోగం అనదగ్గ `అంతరిక్షం 9000కెఎంపిహెచ్` చిత్రానికి సిసలైన ప్రమోషన్ అవసరం. డిసెంబర్ 21న సినిమా రిలీజవుతోంది. సెన్సార్ పూర్తయి ఎలాంటి కట్స్ లేకుండా యు సర్టిఫికెట్ దక్కింది ఇప్పటికే. పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా చూడదగ్గ అడ్వెంచరస్ స్పేస్ థ్రిల్లర్ మూవీ ఇది. అందుకు తగ్గట్టే ఇక బ్యాలెన్స్ టైమ్ ని ప్రచారంతో హోరెత్తించాల్సి ఉంటుంది. అంటే మిగిలి ఉన్న వారం రోజుల్లో జనాలకు దీనిని మరింతగా చేరువ చెయ్యాలి. ఇప్పటికే ట్రైలర్ తో వచ్చిన హైప్ ని యథావిధిగా ఇంకా సస్టెయిన్ చేయాలన్నది ప్లాన్. అందుకే ఈనెల 18న జేఆర్ సీ సెంటర్ లో జరగనున్న ప్రీరిలీజ్ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ నుంచి టాప్ స్టార్లు అందుబాటులో ఉన్నవాళ్లంతా వేదికవద్దకు దిగొస్తారన్న మాటా వినిపిస్తోంది. సైరాతో బిజీగా ఉన్నా.. మెగాస్టార్ చిరంజీవి కానీ - రాజకీయాలతో బిజీగా ఉన్నా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కానీ ఈ వేదికకు వస్తారన్న అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అందుకు సంబంధించి అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. అంత పెద్ద స్టార్లు ఈ వేడుకకు విచ్చేస్తే అందుకు తగ్గట్టే భారీగా మెగాభిమానులు తరలి వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అబ్బాయ్ అంటే బాబాయ్ - పెదనాన్నలకు అంతే గొప్ప అభిమానం. పైగా కెరీర్ కీలక మలుపులో ఉన్నాడు అబ్బాయ్. అందువల్ల అబ్బాయ్ పిలుపును పెదనాన్న - బాబాయ్ లు కాదనరనే మెగాభిమానులు ఆశిస్తున్నారు. ఇకపోతే మెగా ప్రిన్స్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లడమెలానో మెగా ఫ్యాన్స్ వింగ్ సైతం భారీ ప్రణాళికలతో సిద్ధమవుతోందిట. ఎలానూ అభిమాన సంఘాలతో ఎంతో సన్నిహితంగా ఉండే మెగా బ్రదర్ నాగబాబు అండ ఉంది కాబట్టి ఇక వరుణ్ బాబు నడక నల్లేరుపై బండి నడకలా సాగుతుందనే అంచనా వేస్తున్నారు. చూద్దాం.. వ్వాట్ విల్ హ్యాపెన్స్..