Begin typing your search above and press return to search.

సర్దార్ ఆడియో: వాటే సెల్ఫీ గురూ

By:  Tupaki Desk   |   20 March 2016 5:09 PM GMT
సర్దార్ ఆడియో: వాటే సెల్ఫీ గురూ
X
త్రివిక్రమ్ డెైరెక్షన్ లో చిరంజీవి - పవన్.. వినడానికే ఈ మాట కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. సినిమాకి సంబంధించి కాదు.. ఇది కేవలం ఓ ఫోటో కోసం జరిగింది. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో భాగంగా.. మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఒకే స్టేజ్ పై కనిపించారు. చిరు తన తమ్ముడి గురించి బోలెడన్ని సంగతులు చెప్పారు. చిరు మాట్లాడిన తర్వాత.. త్రివిక్రమ్ ఓ సూపర్బ్ ఐడియా ఇచ్చారు.

స్టార్లతో సెల్ఫీలు దిగేందుకు అందరూ ఉత్సాహం చూపుతారు. కానీ మీరు సెల్ఫీ దిగితే బాగుంటుందంటూ త్రివిక్రమ్ ఐడియా ఇచ్చాడు. దీంతో ఈ ఇద్దరి వారి వారి ఫోన్లతో.. చెరో ఫోన్ తో ఒకరి తర్వాత ఒకరు సెల్ఫీలు తీసుకున్నారు. మెగాస్టార్ తో పవర్ స్టార్ సెల్ఫీ తీసుకోగా.. పవన్ తో చిరంజీవి సెల్ఫీ తీసుకున్నాడు.

ఏమైనా అన్నాదమ్ములు తీసుకున్న ఈ సెల్ఫీ మాత్రం అదుర్స్ అనాల్సిందే. చిరు - పవన్ పక్కపక్కన ఉన్న విజువలే సూపర్బ్ గా ఉంటే.. వాళ్లిద్దరూ తమతో తాము ఫోటో తీసుకున్నఈ సందర్భం మాత్రం అభిమానులను బాగా అలరించింది. మెగా అభిమానులకైతో.. ఈ ఫోటోని సెల్ఫీ ఆఫ్ ది సెంచరీ అనాల్సిందే.