Begin typing your search above and press return to search.
ఫొటో స్టొరీ: మెగా ఫ్రేమ్ లో సుష్మిత
By: Tupaki Desk | 24 Sep 2018 1:00 PM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో #RC12 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ అజర్ బైజాన్ లో జరుగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ లొకేషన్ కు కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి గడిపిన సంగతి తెలిసిందే. చిరంజీవి తాజా చిత్రం 'సైరా' తాజా షెడ్యూల్ జార్జియాలో మొదలు కావాలి ఉండగా ఆ షెడ్యూల్ ప్రారంభానికి ముందే చిరు అజర్ బైజాన్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ చిరు - చరణ్ కలిసిన ఫోటోలు ఇప్పటికే బయటకు వచ్చాయి.
తాజాగా అదే లొకేషన్ లో తీసిన మరో ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటోలో చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కూడా ఉంది. మెగా ఫ్రేమ్ లో ఒక వైపు మెగాస్టార్ మరొక వైపు మెగా పవర్ స్టార్లతో మెగా కాస్ట్యూమ్ డిజైనర్ సుష్మిత పోజిచ్చింది. మెగా కాస్ట్యూమ్ డిజైనర్ అనే బిరుదు ఎందుకని మీకు అనుమానం రాలేదా? ఇటు #RC12 కు అటు 'సైరా' కు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తోంది. ఇప్పటికే సుష్మిత 'ఖైది నెంబర్ 150' సినిమా లో చిరంజీవి కి కాస్ట్యూమ్ డిజైన్ చేసి మంచి గుర్తింపు సాధించింది. ఇక ఈ సారి రెండు మెగా సినిమాలకు పని చేస్తూ బిజీగా ఉంది.
ఈ పిక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెగా ఫ్యాన్స్ లైకులతో.. షేర్లతో హోరెత్తిస్తున్నారు. అన్నట్టు సుష్మిత డిజైన్ చేసిన బ్రౌన్ కలర్ షర్టు - ఎలిఫెంట్ బ్లాక్ కలర్ జీన్స్ లో చెర్రీ రగ్డ్ లుక్ లో సూపర్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా..?