Begin typing your search above and press return to search.

షాకింగ్ మేకోవ‌ర్.. చిరునా చిరుత‌నా?

By:  Tupaki Desk   |   4 Aug 2019 8:38 AM GMT
షాకింగ్ మేకోవ‌ర్.. చిరునా చిరుత‌నా?
X
మెగాస్టార్ చిరంజీవి మ‌ళ్లీ ఇర‌వైఏళ్లు చిన్నోడైపోయారా?.. ఏంటీ మేకోవ‌ర్‌.. చిరునా చిరుత‌నా.. గుర్తు ప‌ట్టకుండా మారిపోయారేంటి?. చిరులో ఈ మార్పుకి కార‌ణం ఏంటి?. ఎవ‌రు?. టైట్ ఫిట్ టీష‌ర్ట్‌. ప‌క్క పాపిడి..మునుపెన్న‌డూ క‌నిపించ‌ని స్థాయాలో స్లిమ్ లుక్‌..గెట‌ప్‌ కు త‌గ్గట్టుగా క‌ళ్ల‌జోడు..ఇవ‌న్నీ చూస్తుంటే అచ్చం రామ్‌ చ‌రణ్ చిరుత‌లా క‌నిపిస్తున్నాడు. `బీ పాజిటీవ్ మ్యాగ‌జైన్ ముఖ‌చిత్రంపై క‌నిపిస్తున్న చిరు ఫొటో చూస్తే అవాక్క‌వ్వాల్సిందే. షాక్ క‌లిగించే తీరులో చిరు ఒక్క‌సారిగా ట్రాన్స్‌ ఫార్మ్ కావ‌డం పలువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు భారీ స్థాయిలో క‌నిపించిన చిరు వున్న‌ట్టుండి స్లిమ్‌ గా మారి యంగ్‌ గా 90స్ లుక్‌ లోకి మారిపోవ‌డం చూసిన వాళ్లంతా వాటే మెరాకిల్ అంటున్నారు. `సైరా` న‌ర‌సింహారెడ్డి కోసం ఐదు ప‌దుల వ‌య‌సులో కొంత బ‌రువు త‌గ్గ‌న చిరు కోర‌టాల శివ సినిమా కోసం అబ్బుర‌ప‌రిచే స్థాయిలో షాకింగ్ మేకోవ‌ర్‌ తో యువ హీరోల‌కు ధీటుగా సిద్ధం కావ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. వ‌ర్క్ ప‌ట్ల మెగాస్టార్ కున్న డెడికేష‌న్‌ ని తెలియ‌జేస్తోంది. న‌క్స‌లిజం నేప‌థ్యంలో కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరు ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇందులో చిరు రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. గోవింద్‌ - ఆచార్య అనే పాత్ర‌ల్లో చిరు క‌నిపించ‌బోతున్నారు. దీని కోస‌మే ఆయ‌న స్లిమ్‌ గా మ‌రింత యంగ్ మేకోవ‌ర్‌ తో రెడీ కావ‌డం యంగ్ హీరోల‌కే మ‌తిపోగొడుతోంది.