Begin typing your search above and press return to search.

చిరు: ఏంట్రా.. ఇలా ఇరగ్గొట్టేశావ్‌!?

By:  Tupaki Desk   |   26 April 2016 4:09 AM GMT
చిరు: ఏంట్రా.. ఇలా ఇరగ్గొట్టేశావ్‌!?
X
సరిగ్గా సరైనోడు విడుదలకు ముందు రోజున మెగాస్టార్ చిరంజీవికి.. సరైనోడు ప్రివ్యూ వేసి చూపించారు సినిమా యూనిట్. చిరుతో పాటు సినిమా చూసిన వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - దర్శకుడు బోయపాటి శ్రీనులతో పాటు, నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ఈ మూవీ అంతా చూశాక.. చిరంజీవి స్టన్ అయిపోయారని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ ప్రివ్యూ షో అయ్యాక ఏం జరిగిందో సరైనోడు యూనిట్ విపరీతంగా ఎగ్జయిట్ అవుతూ చెప్పింది.

చిరు కోసం వేసిన సరైనోడు సినిమా ప్రివ్యూ పూర్తయింది. అంతే ఒక్క ఉదుటన లేచి బన్నీ దగ్గరికి వచ్చి,.. గట్టిగా పట్టుకుని.. 'ఏంట్రా ఇలా ఇరగ్గొట్టేశావ్?' అన్నారట చిరు. తన కొడుకుని చిరంజీవి ఇచ్చిన ఎక్స్ ప్రెషనే.. అతి పెద్ద కాంప్లిమెంట్ అంటూ అల్లు అరవింద్ చెప్పారు. ఇక ఆ వెంటనే మైక్ తీసుకున్న బన్నీ.. 'ఎంత మంది హీరోలు వచ్చినా.. మా నాన్నకు ఎవరైనా చిరంజీవి గారి తర్వాతే' అంటూ నవ్వేశాడు.

ఇక అదే ఇన్సిడెంట్ లో బోయపాటి కూడా భాగమయ్యాడు. 'నా ఇంట్లో పెరిగిన పిల్లోడు. ఈ స్థాయి నేను ఊహించలేదు. లో యాంగిల్ లో చేస్తుంటే నాకే మైండ్ బ్లాంక్ అయింది. షాక్ అయిపోయానమ్మా' అంటూ బోయపాటి రెండు భుజాలు కుదిపేస్తూ చెప్పారట చిరు. ఆయన నుంచి ఆ రేంజ్ కాంప్లిమెంట్ వచ్చేసరికి బోలెడంత సంతోషం వేసిందని తన ఆనందాన్ని సరైనోడు సక్సెస్ మీట్ లో పంచుకున్నాడు బోయపాటి శ్రీను.