Begin typing your search above and press return to search.
బన్నీ విషయంలో ఫుల్ క్రెడిట్ చిరుదే
By: Tupaki Desk | 11 April 2016 11:30 AM GMTచిరంజీవి వేసిన రోడ్డు మీద తామంతా కార్లో తిరుగుతున్నామంటూ అల్లు అర్జున్ తన మావయ్య మీద గౌరవాన్ని చాటుకుంటే.. చిరు రివర్స్ లో బన్నీని ఆకాశానికెత్తేశాడు. తన బిడ్డ లాంటి అల్లు అర్జున్ ఈ రోజు ఈ స్థాయికి ఎదగడం చూసి గర్వకారణంగా ఉందని.. అతను చేస్తున్న పాత్రలు అద్భుతమని చిరు పొగిడేశాడు. ఐతే బన్నీ హీరో కావడంలో పూర్తి క్రెడిట్ తనకే ఇవ్వాలంటూ రెండు ఉదాహరణలు చెప్పాడు చిరు.
‘‘నాకు రామ్ చరణ్ ఎంతో బన్నీ కూడా అంతే. అతను కూడా నా బిడ్డే. ఈ రోజు తనను చూస్తుంటే మన బిడ్డ అని గర్వంగా ఉంటుంది. బన్నీ చిన్నపుడు ఇంట్లో కార్టూన్ క్యారెక్టర్లను మిమిక్రీ చేస్తూ.. ఇమిటేట్ చేస్తూ.. ఫంక్షన్లు జరిగినపుడు డ్యాన్సులేస్తూ అలరించేవాడు. అతడి టాలెంట్ చూసి.. డాడీ సినిమా చేస్తున్నపుడు నేనే స్వయంగా ఓ క్యారెక్టర్ క్రియేట్ చేసి.. బన్నీతో చేయిద్దాం అని చేయించాను. అలా బన్నీ సినిమాల్లోకి రావడానికి బీజం వేసింది నేనే అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది.
ఆ తర్వాత ‘గంగోత్రి’ సినిమా చేయడానికి రాఘవేంద్రరావుగారు.. అరవింద్.. అశ్వనీదత్ నిర్ణయించుకున్నపుడు ఈ సినిమాకు హీరోగా బన్నీని తీసుకోమని చెప్పిన ముఖ్యుల్లో నేనొకడిని. అరవింద్ గారు నన్ను చెప్పమంటే.. బన్నీ అన్నిరకాలుగా టాలెంటెడ్.. అతణ్ని నిరభ్యంతరంగా తీసుకోండి అని రాఘవేంద్రరావుగారికి చెప్పాను. అవకాశాలు రావడం ఒక ఎత్తు.. వాటిని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. అది వాళ్ల చేతుల్లోనే ఉంది. బన్నీ ఎంత కష్టపడతాడో మాటల్లో చెప్పలేను. తను ఈ రోజు ఎంత మంచి ఎంత మంచి డ్యాన్సర్ అనిపించుకున్నా సరే.. సాధన మానుకోడు. ప్రత్యేకంగా డ్యాన్సింగ్ హాల్ కట్టించుకుని అందులో శిక్షణ తీసుకుంటూ.. కసరత్తులు చేస్తుంటాడు. ఎంత బిజీగా ఉన్నా.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటాడు. ఇదంతా ఒక స్ఫూర్తి.. కష్టాన్ని నమ్ముకుంటేనే.. విజయాలు వస్తాయి అనడానికి ఉదాహరణ.
ఈ రోజు బన్నీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలో కూడా తన ప్రభావం చూపిస్తూ లక్షలాదిమందిని అభిమానుల్ని సంపాదించుకున్నందుకు నేను గర్విస్తున్నాను. బన్నీలో ప్రస్తుతం ఓ పక్కా ప్రొఫెషనల్ హీరోను చూస్తున్నాను. నటుడిగా పరిణతి.. వ్యక్తిగా హుందాతనం చూస్తున్నాను. అంతకుముందు ఇమ్మెచ్యూరెన్స్.. చిలిపిగా నటించేవాడు. కానీ ఇంకా వెయిట్ ఉన్న.. డెప్త్ ఉన్న పెర్ఫామెన్స్ చేయట్లేదు అనుకుంటున్న సమయంలో.. ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్రలో అద్భుతంగా నటించాడు. ఒక చరిత్రాత్మక సినిమాకు కమర్షియల్ హీరో జోడైతే ఎలా ఉంటుందో చూపించాడు. ఈ సినిమా అంత పెద్ద విజయం సాధించడానికి ప్రధాన కారణం బన్నీ పోషించిన కీలకమైన పాత్రే’’ అని చిరు అన్నాడు.