Begin typing your search above and press return to search.
చిరంజీవి సార్.. కాజోల్ కాదు కాజల్
By: Tupaki Desk | 8 Jan 2017 4:32 PM GMTమెగాస్టార్ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150.. అభిమానులు ఆశించిన స్థాయిలోనే హై రేంజ్ లో జరిగింది. అభిమానుల తాకిడి ఎక్కువయిపోవడంతో త్వరత్వరగా ముగించేయాల్సి వచ్చిందంతే. అయితే.. ఈ వేడుకలో భాగంగా చిరంజీవి స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది కానీ.. ఒక్క హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని మాత్రం కొంచెం బాధ పెట్టిందట. ఇందుకు కారణం లేకపోలేదు.
తన టీం ప్రతీ ఒకరినీ తెగ పొగిడేసే చిరు.. కాజల్ గురించి కూడా మాట్లాడుతూ బోలెడన్ని ప్రశంసలు కురిపించారు. కాకపోతే.. ఆయన స్పీచ్ లో భాగంగా 'కాజోల్' అంటూ మూడు నాలుగు సార్లు పలికారు. కాస్త గట్టిగానే ఒత్తి మరీ కాజోల్ అన్నారు మెగాస్టార్. కానీ అమ్మడి పేరు కాజల్. చిరు లాంటి స్టార్ కి ఈ మాత్రం తెలియదని కాదు కానీ.. ఆయన స్టేజ్ పై మాట్లాడేటపుడు ముఖ్యంగా అవతలి వ్యక్తుల గురించి పొగిడేటపుడు బాగా గంభీరత జోడించేస్తారు. అక్కడే తేడా వచ్చేస్తోంది. కాజోల్ అంటే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.
ముందు కొడుకుతో చేసి తర్వాత తండ్రితో చేసిన తొలి హీరోయిన్ అంటూ చిరంజీవి ప్రశంసలను ఎంజాయ్ చేసినా.. తన పేరు కాసింత క్లియర్ గా పలికి ఉంటే బాగుండేదని.. కనీసం తనైనా ఇంకాస్త డీటైల్డ్ గా తన పేరు వివరంగా చెప్పి ఉండే బాగుండేదని ఫీల్ అవుతోందట టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/