Begin typing your search above and press return to search.
సాటి తారలపై చిరు చెప్పినవి అక్షర సత్యాలు
By: Tupaki Desk | 6 Oct 2022 3:47 AM GMTమెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలై క్రిటిక్స్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. చిరు డీసెంట్ పెర్ఫామెన్స్ కి.. మోహన్ రాజా దర్శకత్వ ప్రతిభకు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ పొలిటికల్ డ్రామాలో నయనతార- సత్య దేవ్- సల్మాన్ ఖాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. గాడ్ ఫాదర్ మలయాళ చిత్రం లూసిఫర్ కి అధికారిక రీమేక్. థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన అనంతరం సత్య దేవ్ ఇందులో విలన్ పాత్రను పోషించారని క్లారిటీ వచ్చింది.
ప్రమోషన్స్ సమయంలో సత్యదేవ్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగానే ధృవీకరించింది. ఇప్పటి వరకు సత్య దేవ్ తన చాలా సినిమాల్లో సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసాడు. ప్రేక్షకుల మైండ్ లో అతడికి ఉన్న ఇమేజ్ వేరు. కానీ దానికి భిన్నంగా అతడు విలనీ అదరగొట్టాడన్న ప్రశంసలు దక్కుతున్నాయి.
అతడి నటనను దగ్గరగా చూసిన వాడిగా మెగాస్టార్ చిరంజీవి కూడా తొలినుంచి సత్యదేవ్ పై ప్రశంసలు కురిపించారు. సత్యదేవ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడని ఆ పాత్రకు సత్యను సూచించానని కూడా చిరు పేర్కొన్నాడు. సత్యదేవ్ కెరీర్ కి అవసరమైన బూస్ట్ ఇచ్చారు చిరు.
నిజానికి చిరు లాంటి లెజెండ్ ముందు సల్మాన్ లాంటి గొప్ప స్టార్ నటిస్తున్న సినిమాలో సత్యదేవ్ లాంటి సాధారణ నటుడు విలన్ గా కనిపిస్తాడా? అతడు మెప్పించగలడా? అని సందేహించారు. అతడు మెయిన్ విలన్ అనగానే అందరిలో ఏదో ఒక మూల సందేహం. కానీ అన్నిటినీ పటాపంచలు చేస్తూ సత్యదేవ్ అద్భుతంగా నటించాడన్న ప్రశంసలు దక్కాయి. చిత్రం విడుదలైన తర్వాత చిరు అంతగా సత్యదేవ్ ని ఎందుకు వెనకేసుకుని వచ్చారో అర్థమైంది. సత్యదేవ్ విషయంలో చిరు మాట్లాడినది అక్షర సత్యం.
ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార చిరుకు సోదరి పాత్రను పోషించిందని తను గొప్పగా నటించిందని చిరు ప్రశంసించారు. అలాగే పూరి జగన్నాథ్ నటించడానికి వెనుకాడారు కానీ అతను తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడని కూడా చిరంజీవి అన్నారు. తన సహచర నటీనటుల గురించి చిరు చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలు అని సినిమా చూశాక అందరూ అంగీకరిస్తున్నారు.
అంత అద్భుతంగా ప్రతి పాత్రను మలిచిన మోహన్ రాజాపైనా ప్రశంసలు కురుస్తున్నాయి. మెగాస్టార్ కొంత గ్యాప్ తర్వాత తన స్థాయికి తగ్గ పాత్రను ఎంపిక చేసుకున్నారని మరోవైపు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.