Begin typing your search above and press return to search.
మేనేజర్లే పునాది రాళ్లు.. పొగిడేసిన చిరు
By: Tupaki Desk | 9 Sep 2019 5:46 AM GMTతెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ తెలుగు సినీ రథసారధుల రజతోత్సవ వేడుక హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది. 25 ఏళ్ల సినీ మహోత్సవంలో ప్రొడక్షన్ మేనేజర్ల గొప్పతనాన్ని మెగాస్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ మహేష్.. దిల్ రాజు వంటి వారు పొగిడేయడం హైలైట్.
మేనేజర్ల కష్టం అంతా ఇంతా కాదు... వాళ్లు ఎంత శ్రమిస్తారో నేను ప్రత్యక్షంగా చూసాననని ముఖ్య అతిధిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకలో అన్నారు. ఆఫీస్ తీసినప్పటి నుండి సినిమా విడుదలయ్యే వరకు శ్రమించేది మేనేజర్లు. సినిమా అనే అద్భుతమైన సౌధం అనుకుంటే మేనేజర్లు పునదిరాళ్లు.. అంటూ ఆకాశానికెత్తేశారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో తక్కువ నిద్రపోయేది మేనేజర్లే.. సక్సెస్ లో వారి వంతు చాలా ఉంటుందని అన్నారు. సైరా కోసం లొకేషన్ వెతికిన మా మేనేజర్ అవతలి వాళ్ల కాళ్ళ మీద పడి మరీ అనుమతి తీసుకున్నారని టాప్ సీక్రెట్ ని రివీల్ చేశారు. అందుకే ఈ వేడుకను విజయవంతం చెయ్యడానికి అందరూ స్వచ్చందంగా వచ్చామని అన్నారు.
ఈ వేడుక సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం కొత్త ఎనర్జీని ఇచ్చిందని మహేష్ ఆనందం వ్యక్తం చేశారు. భవిషత్ లో మరిన్ని సక్సెస్ ఫుల్ ఈవెంట్లు చెయ్యాలని కోరుకుంటున్నాను అన్నారు. 32 సినిమాలు తీసిన సందర్భంగా మేనేజర్స్ యూనియన్ కు 32 లక్షలు కానుకగా ఇస్తున్నానని దిల్ రాజు ప్రకటించారు. నేను నిర్మించిన మంచి చిత్రాల్లో మేనేజర్స్ సహాయ సహకారాలు ఉన్నాయని ఆయన ప్రశంసించారు.