Begin typing your search above and press return to search.

అదీ పవర్ స్టార్ మిత్రుడి కథ

By:  Tupaki Desk   |   21 March 2016 10:30 PM GMT
అదీ పవర్ స్టార్ మిత్రుడి కథ
X
శరత్ మరార్.. పేరు చూసే చెప్పేయొచ్చు. అతను లోకల్ కాదని. తెలుగు కూడా సరిగా వచ్చినట్లు కనిపించడు. ఎక్కువగా ఇంగ్లిష్ లోనే మాట్లాడుతుంటాడు. మరి ఇతను పవన్ కళ్యాణ్ కు అత్యంత ఆప్త మిత్రుడిగా ఎలా మారాడో.. వాళ్లిద్దరికీ ఎప్పుడు స్నేహం కుదిరిందో అందరికీ ఆశ్చర్యమే. ఐతే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుక సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాటల్ని బట్టి.. మరార్ కేవలం పవన్ కు మాత్రమే కాక మెగా ఫ్యామిలీకే అత్యంత ఆప్తుడని.. ఈ కుటుంబంతో అతడి బంధం దాదాపు ఒకటిన్నర దశాబ్దం నుంచి సాగుతోందని అర్థమైంది.

చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. పవన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘జానీ’ సినిమాకు శరత్ మరార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాల ప్రొడక్షన్ వ్యవహారాల్ని కూడా చూసుకున్నాడట. అంతే కాక.. అతను మాటీవీ సీఈవోగా పని చేసి.. ఆ ఛానెల్ ఎదుగుదలలోనూ కీలక పాత్ర పోషించాడట. మా టీవీలో చిరు ఫ్యామిలీకి వాటాలున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబానికి అత్యంత నమ్మకస్థుడు, సమర్థుడు కావడంతో మాటీవీ సీఈవోగా చిరునే అతణ్ని పెట్టించాడట.

పవన్ ద్వారా మెగా ఫ్యామిలీకి చేరువై.. ఆ తర్వాత వాళ్లకు సంబంధించి అనేక వ్యవహారాలు చూశాడట మరార్. అతను తమ కుటుంబసభ్యుడి లాంటి వాడేనని చిరు చెప్పడం విశేషం. తన తమ్ముడి కలలు కన్న సినిమాను ఎంతో ప్యాషన్ తో నిర్మిస్తున్నాడని చిరు కితాబిచ్చాడు చిరు. పవన్ కీలక పాత్ర పోషించిన ‘గోపాల గోపాల’ సినిమాను సురేష్ బాబుతో కలిసి నిర్మించిన మరార్.. ఇప్పుడు సోలోగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని నిర్మించాడు మరార్.