Begin typing your search above and press return to search.
చిరు 151 మ్యూజిక్ డైరక్టర్ ఫిక్స్
By: Tupaki Desk | 31 July 2016 5:39 PM GMTశ్రీరస్తు శుభమస్తు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి సందడి మామూలుగా లేదు. ఫంక్షన్ లో ఉన్నవాళ్లని లేని వాళ్లని కూడా ప్రతీ ఒక్కరినీ గుర్తు చేసుకుంటూ మాట్లాడే మెగాస్టార్.. అక్కడ ఉన్నవాళ్ల ప్రతిభను పొగడ్డానికి ఏ మాత్రం ఆలోచించరు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీరస్తు శుభమస్తుకు ఆడియో ఇచ్చిన ఎస్ ఎస్ థమన్ ని అయితే ఆకాశానికి ఎత్తేశారు చిరు.
'నేను 151వ సినిమా చేస్తే.. దానికి సంబంధించిన మ్యూజిక్ ఇప్పటి నుంచే రెడీ చేస్కో. ట్యూన్స్ బాగుంటే నీకు నాకు అగ్రిమెంట్ అయిపోయినట్లే' అంటూ ఆడియో ఫంక్షన్ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవి చెప్పడంతో.. ఇక థమన్ మొహంలో వెలుగులు చూడాలే తప్ప చెప్పడం సాధ్యం కాదు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలకు వరుసగా సంగీతం ఇచ్చేస్తున్న థమన్ కి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి కానీ.. ట్యూన్స్ బాగుంటే అనే కండిషన్ ని మెగాస్టార్ సెట్ చేసిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.
ఈ ఆఫర్ కి ముందు.. ఎస్ఎస్ థమన్ కి కొత్త అబ్రివేషన్ చెప్పారు చిరు. 'ఎస్ ఎస్ థమన్ లో ఎస్ఎస్ ఏంటో నాకు తెలీదు. ఎప్పుడూ సిగ్గు పడుతూ ఉంటాడు. సూపర్ హిట్స్ ఇస్తూ ఉంటాడు. అందుకే సిగ్గు సూపర్ హిట్ థమన్ అనుకుంటున్నా. అతని పాటలు వింటున్నపుడు.. మ్యూజిక్ లో సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది. పాట కష్టపడి వినాలేమో అనిపిస్తుంది. కానీ అతని మ్యూజిక్ కి అడిక్ట్ అయిపోతాం. తెలీకుండానే హిప్నాటిజం చేసేస్తాడు. నువ్వు వెళుతున్న రూట్ కరెక్టే. ప్రోసీడ్' అంటూ థమన్ కి బూస్ట్ పట్టించేశారు చిరంజీవి.