Begin typing your search above and press return to search.
తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న చరణ్...!
By: Tupaki Desk | 21 May 2020 5:15 AM GMTమెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికి వరకు సుమారు డజను మంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వారిలో చాలా వరకు అందరూ సక్సెస్ అవుతూ వస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో తన హవా చూపిస్తున్నాడు. యాక్టింగ్ ఫైట్స్ డ్యాన్స్ డైలాగ్ డెలివరీ లలో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. చిరు తనయుడిగా 'చిరుత' సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తనేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'మగధీర' సినిమాలో నటించి ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసాడు. ఈ సినిమాతో తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడమే కాక అశేష అభిమానులను కూడా సంపాదించుకున్నాడు చరణ్. అయితే ఆ తర్వాత రామ్ చరణ్ కి వరుస పరాజయాలు పలకరించాయి. కొన్ని సినిమాలు మాత్రం అవేరేజ్ సినిమాలుగా నిలిచిపోయాయి.
'ఆరెంజ్' 'రచ్చ' 'బ్రూస్లీ' 'గోవిందుడు అందరి వాడే' సినిమాలు ఆశించినంత విజయాన్ని అందించలేదు. 'నాయక్' 'ఎవడు' సినిమాలు మాత్రం పర్వాలేదు అనిపించుకున్నాయి. అయినా నిరాశ చెందకుండా రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళ 'తని వరువన్' రీమేక్ గా 'ధృవ' సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దీనితో ఆయన కెరీర్ మళ్ళీ ఊపందుకుంది. ఈసారి సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' సినిమాతో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకొని రికార్డులను తిరగరాశారు. పల్లెటూరి వ్యక్తి పాత్రలో చెవిటి వాడిగా నటించి సంచలనం సృష్టించాడు. ఈ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించి అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. అయితే వెంటనే 'వినయ విధేయ రామ' రూపంలో మరో భారీ డిజాస్టర్ చవిచూశాడు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్.ఆర్.ఆర్' (రణం రౌద్రం రుధిరం) అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో 'అల్లూరి సీతారామరాజు' పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ మరియు ఇంట్రో వీడియో చూస్తే ఆయన ఖాతాలో మరో విజయం నమోదయ్యేలా కనిపిస్తోంది. దీంతో పాటు తండ్రితో కలిసి 'ఆచార్య' సినిమాలో కనిపించనున్నాడు. అంతేకాక ఒకవైపు నటుడిగా కొనసాగుతూనే కొణిదెల ప్రొడక్షన్ సంస్థను స్థాపించి నిర్మాతగా మారారు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ 'ఖైదీ నెం 150' సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా కూడా నిర్మించాడు. 'ఆచార్య' 'లూసిఫర్' రీమేక్ చిత్రాలకు కూడా రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఏదేమైనా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా పడిలేచిన కెరటం వలె టాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తున్నాడని చెప్పవచ్చు.