Begin typing your search above and press return to search.
మేనేజర్లు ఆడే అబద్దాలు ఎవరూ ఆడరు!
By: Tupaki Desk | 9 Sep 2019 9:18 AM GMTసెట్లో ఎవరు బాగా తిట్లు తింటారో వాళ్లనే ప్రొడక్షన్ మేనేజర్లు అంటారు. అందరికీ తెలిసిన ఈ నిజాన్ని మెగాస్టార్ చిరంజీవి అంతే అందంగా చెప్పారు మేనేజర్ల(ఎగ్జిక్యూటివ్ ల) రజతోత్సవ వేదికపై. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్లో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ అదిరిపోయే పంచ్ లే వేశారు మేనేజర్లపై. అయితే అదంతా సరదా సరదాగా సాగిన కార్యక్రమం. చిరు తనదైన స్టైల్లో ఎంతో ఉత్సాహంగా ఉపన్యాసం కొనసాగిస్తూ.. `వీరు ఆడే అబద్దాలు ఎవరూ ఆడరు` అంటూ ఛమత్కారంతో కూడి చలోక్తులతో అహూతుల్ని చిరు నవ్వించారు. ఈ ప్రసంగంలో మేనేజర్ల గురించి మరికొన్ని ఆసక్తికర సంగతులు లీకిచ్చారు.
నిర్మాతలకు కోపం వచ్చినా.. నటీనటులు లేటుగా సెట్ కి వచ్చినా తొలిగా తిట్లు తినేది ప్రొడక్షన్ మేనేజర్లు. వీళ్లను పిలిచి ఫలానా హీరో.. ఫలానా హీరోయిన్ సమయానికి రాలేదేం.. ప్రాణాలు తీస్తున్నారు! అని కోపగించుకుంటారు నిర్మాతలు. మీరు కంగారు పడకండి.. మేం చూసుకుంటాం అంటూ ఆ హీరో లేదా హీరోయిన్ వద్దకు వెళ్లి మీరు లేకపోతే ఇక షూటింగ్ నే లేదు.. అంతగా వెయిట్ చేస్తున్నారు అని చెప్పి వేడెక్కిన వాతావరణాన్ని చల్లబరుస్తారు.
``నిర్మాత మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు. మీ కో ఆపరేషన్ అంతా ఇంతా కాదు`` అంటూ మునగచెట్టెక్కించే స్కిల్ లోనూ మేనేజర్లు రాటు దేలిపోయి ఉన్నారని ఓ పాయింట్ చెప్పారు చిరు. నిర్మాత చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా చెప్పి ఆ హీరో లేదా హీరోయిన్ సంతోష పడేలా చేస్తారని చిరంజీవి చెప్పుకొచ్చారు. కోపతాపాల్లేకుండా సెట్లో అందరి మధ్య సుహృద్భావ వాతావరణం తెచ్చేది మేనేజర్లేనని కొనియాడారు. అంతా బావుంది కానీ.. మేనేజర్ల గురించి జనం తెలుసుకోవాల్సిన ఇంకా చాలా కోణాలు ఉన్నాయని అంటారు. మరి అవేమిటో!!