Begin typing your search above and press return to search.
మేమంతా ఒక్కటే-వైరల్ పిక్
By: Tupaki Desk | 5 Jan 2018 6:55 AM GMTఅప్పుడప్పుడు ఏవో సందర్భాల్లో చిన్న చిన్న మాటలు అనుకున్నా - అపార్థాలు చోటు చేసుకున్నా హీరోల మధ్య మంచి సఖ్యత ఉందనే విషయాన్నీ ఎప్పటికప్పుడు ఋజువు చేస్తున్నా అభిమానుల మధ్య మాత్రం అవి పూర్తిగా తొలగడం లేదు. తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ చూస్తే ఏ అనుమానం ఉన్నా క్లియర్ కావడం ఖాయం. ఇటీవలే డిసెంబర్ 31వ తేది రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టి.సుబ్బరామిరెడ్డి గారు తన ఏడు నక్షత్రాల హోటల్ లో ఇచ్చిన విందుకు అందుబాటులో ఉన్న తారలంతా తరలి వెళ్లారు. అందులో చిరంజీవి - మోహన్ బాబు - రాజ శేఖర్ - నాగ బాబు - జీవితా ఇలా చాలా మందే వచ్చారు. అందరిలోకి సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం చిరునే. గరుడవేగా ప్రమోషన్ సందర్భంగా తనకు చిరంజీవికి ఎటువంటి అపార్థాలు లేవని, గతంలో జరిగినవి మర్చిపోయి ఇప్పుడు హ్యాపీగా ఉన్నామని రాజశేఖర్ చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక చిరంజీవి - మోహన్ బాబుల మధ్య వజ్రోత్సవాల టైంలో - పద్మ పురస్కారం వచ్చినప్పుడు స్వల్ప వివాదం రేగింది కాని సందర్భం వచ్చినప్పుడు తాము ఎంత క్లోజ్ అనేది ఇద్దరు బయట పెట్టుకుంటూనే ఉన్నారు. ఈ పిక్స్ లో కూడా అదే స్నేహ బంధాన్ని చూపిస్తూ స్టిల్స్ ఇవ్వడం ఫాన్స్ కి మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. గత సంవత్సరం బాలయ్య ఒక ఇంటర్వ్యూలో చిరు ఒక్కడే తనకు ఫ్రెండ్ అని చెప్పడం, మొన్న జరిగిన హలో ఆడియో వేడుకలో అఖిల్ చిరుని పెదనాన్న అని - చరణ్ ని అన్నయ్య అని పిలవడం ఇవన్ని మంచి పరిణామాలే. రాజమౌళి దర్శకత్వంలో చరణ్-తారక్ మల్టీ స్టారర్ చేయబోతున్నారు అనే వార్త ఎంత ట్రెండింగ్ అయ్యిందో చూసాం. మంచి వాతావరణాన్ని దగ్గరుండి ప్రోత్సహిస్తున్న హీరోలను స్ఫూర్తిగా అభిమానులు నడుచుకుంటే ఫ్లెక్సీలో కోసం గొడవ పడటం లాంటి సంఘటనలు జరగవు.