Begin typing your search above and press return to search.
ఇంతకీ చిరు ఎంత పుచ్చుకుంటున్నాడు
By: Tupaki Desk | 11 Sep 2015 9:30 AM GMTరామ్ చరణ్ కొత్త సినిమా ‘బ్రూస్ లీ’లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ చేస్తున్నాడంటే ముందు లేదు లేదన్నారు కానీ.. నిజానికి అదే నిజమని తేలింది. చిరు చేస్తోంది ఊరికే రెండు మూడు నిమిషాలు అలా మెరిసి మాయమయ్యే పాత్ర కూడా కాదు. హీరోగా సినిమా ఇప్పుడిప్పుడే మొదలయ్యే అవకాశం లేకపోవడంతో అభిమానుల్ని సంతృప్తిపరచడానికి ‘బ్రూస్ లీ’లో ఓ పావు గంట పాటు కనిపించడానికి సిద్ధమవుతున్నారు చిరు. ఇందులో చిరు ఓ స్టార్ హీరో పాత్రలో నటిస్తుంటే స్టంట్ మాస్టర్ పాత్రలో కనిపించబోయే చరణ్ ఆయనతో ఫైట్లు చేయిస్తాడన్నమాట.
ఓ ఫైట్ తో పాటు చిరు పాటలోనూ కనిపిస్తాడు చిరు. ఆ పాట ఆయన నటించే సినిమాలో భాగంగా వస్తుందన్నమాట. చిరంజీవి ‘బ్రూస్ లీ’లో నటిస్తాడన్న సంగతి ఖాయం కాగానే ఈ సినిమా బిజినెస్ రేంజి ఎక్కడికో వెళ్లిపోయింది. మామూలుగానే ఈ సినిమాకు దాదాపు రూ.45 కోట్ల దాకా బిజినెస్ జరిగే అవకాశాలుండగా.. చిరు ఎంట్రీ ఖాయమవగానే ఆ లెక్క 60 కోట్లను దాటిందని అంటున్నారు. దీంతో నిర్మాత డీవీవీ దానయ్య పంట పండినట్లే అని చెబుతున్నారు.
మరి తన వల్ల సినిమాకు ‘బ్రూస్ లీ’కి ఇంత లాభం జరుగుతున్నపుడు చిరు ఎంత పారితోషకం తీసుకుంటాడన్నది ఆసక్తికరం. ఆయన హీరోగా ఉన్నపుడు అత్యధిక పారితోషకం అందుకున్నారు. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చినా పవన్, మహేష్ లకు దీటుగానే పుచ్చుకుంటారు. మరి ‘బ్రూస్ లీ’లో గెస్ట్ రోల్ కు ఎంత తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. కొందరేమో ఐదు కోట్ల దాకా అందుకున్నట్లు చెబుతున్నారు. కొందరేమో ఏమీ తీసుకోకుండా ఉచితంగా నటిస్తున్నాడని కూడా అంటున్నారు. ఐతే సినిమాకు అంత లాభం జరుగుతున్నపుడు చిరు మరీ ఫ్రీగా నటిస్తాడా అన్నది డౌటు. ఇదేమీ తమ సొంత బేనర్ లో తీస్తున్న సినిమాయేమీ కాదు కదా.