Begin typing your search above and press return to search.

ఇంతకీ చిరంజీవికి ఎంతిస్తున్నారు?

By:  Tupaki Desk   |   15 Oct 2016 11:30 AM GMT
ఇంతకీ చిరంజీవికి ఎంతిస్తున్నారు?
X
యాడ్స్ చేయడాన్ని.. బుల్లితెరపై షోలు చేయడాన్ని చాలా తక్కువగా చూసేవాళ్లు మన హీరోలు ఒకప్పుడు. కానీ బాలీవుడ్ హీరోలు సినిమాలతో కంటే వాటితోనే ఎక్కువ సంపాదిస్తున్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించి.. మనోళ్లు కూడా రూటు మార్చారు. వరుసబెట్టి అందరూ యాడ్స్ చేస్తున్నారు. అలాగే బుల్లితెర షోలు కూడా హోస్ట్ చేస్తున్నారు. అక్కినేని నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో.. ఆ షోకు ఎలాంటి ఆదరణ తెచ్చిపెట్టారో తెలిసిందే. ఇప్పుడు ఆయన సీట్లోకి మెగాస్టార్ చిరంజీవి వచ్చేస్తున్నారు. నవంబర్లోనే ఆయన హోస్ట్‌ గా కొత్త సీజన్ మొదలైపోతోంది.

చిరు హోస్ట్ చేసే కొత్త సీజన్ తో బుల్లితెర టీఆర్పీ రేటింగ్స్ పతాక స్థాయిని అందుకుంటాయని భావిస్తున్నారు. అలాగే ఈ షో ఆదాయం కూడా భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొత్త సీజన్లో యాడ్స్ కోసం మంచి డిమాండ్ ఉన్నట్లు సమాచారం. మరి ఇంత ఆకర్షణ సంపాదించుకున్న షో కోసం చిరు ఎంత పారితోషకం తీసుకుంటారన్నది ఆసక్తికరం. ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న చర్చల ప్రకారం ‘ఎంఈకే’ ఒక్కో ఎపిసోడ్ కోసం చిరు రూ.10 లక్షల పారితోషకం తీసుకుంటారట. అలా ఎన్ని ఎపిసోడ్లు చేస్తే అన్ని పది లక్షలన్నమాట. ఒకే రోజు వరుసగా షూట్ చేసి.. దాన్ని ఎపిసోడ్లుగా కట్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఆ లెక్కన రోజుకు మూడు ఎపిసోడ్లు చేస్తే రూ.30 లక్షలు ముడుతుంది. ఈ లెక్కన ఈ సీజన్ అయ్యేసరికి కొన్ని కోట్లు చిరు ఖాతాలోకి చేరతాయి. దాదాపుగా ఒక సినిమా కోసం తీసుకునే పారితోషకాన్ని రోజుల్లోకి మార్చి లెక్క కడితే ఎంత ఉంటుందో.. అంతకంటే ఎక్కువే ఈ షో ద్వారా చిరు అందుకునే అవకాశముంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/