Begin typing your search above and press return to search.
మెగాస్టార్ మణిశర్మ విషయంలో తప్పు చేశారా?
By: Tupaki Desk | 14 April 2022 7:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి నుంచి సినిమా వచ్చి దాదాపు రెండున్నరేళ్లవుతోంది. దీంతో ఆయన సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందా? అని ప్రేక్షకులు, అభిమానలు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. 'సైరా నరసింహారెడ్డి' తరువాత మెగాస్టార్ నటించిన చిత్రం 'ఆచార్య'. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల నుంచి దాదాపు నాలుగేళ్ల తరువాత వస్తున్న సినిమా ఇది కావడం, ఇందులో చిరుతో కలిసి మెగా పవర్ స్టార్ కీలక పాత్రలో నటించడంతో 'ఆచార్య'ని చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు.
భారీ అంచనాల మధ్య అత్యత భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిరు ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆచార్య' ట్రైలర్ రానే వచ్చేసింది.
ఊహించయని విధంగా ట్రైలర్ రామ్ చరణ్ నేపథ్యం నుంచి మొదలైన తీరు మధ్యలో చిరు ఎంట్రీ ఇవ్వడం.. మధ్యలో ఆగిపోయిన అతని ఆశాన్ని నెరవేర్చి పాదఘట్టం.. ధర్మస్థలికి అండగా నిలబడటం.. ఇక పోరాట ఘట్టాల్లోనే చరణ్ కు ట్రైలర్ లో పెద్ద పీట వేసి చూపించిన తీరు పలువురిని ఆశ్చర్యానికి.. ఆయో మయానికి గురిచేసింది.
సినిమా మెగాస్టార్ దా? తేక చరణ్ దా? అనే అనుమానాల్ని రేకెత్తించింది. ట్రైలర్ ఆసాంతం చరణ్ ని ఎలివేట్ చేసిన తీరు, అతని నేపథ్యంలో కీలక ఘట్టాలని ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులతో పాటు అభిమానుల్లో పలు అనుమానాల్ని రేకెత్తించింది. ఇక ఇందులో బోయపాటి శ్రీను చిత్రాల తరహాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా వుండటంతో ఫైనల్ కట్ ని బోయపాటి కట్ చేశాడా? అనేంతగా కామెంట్ లు మొదలయ్యాయి.
ఇక చరణ్ పరిచయ సన్నివేశాల్లో.. చిరు ఇంట్రడక్షన్ సీన్ లలో మణిశర్మ అందించిన బీజిఎమ్స్ రోమాంచిత అనుభూతిని కలిగించాయి. అయితే ఈ సినిమాని తమన్ కి ఇచ్చి వుంటే బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో వుండేదనే చర్చ ఇప్పడు నెట్టింట వైరల్ గా మారింది. ట్రైలర్ ప్రారంభం లో వినిపించిన బీజీఎమ్స్ ఇటీవల వచ్చిన పవన్ చిత్ర నేపథ్య సంగీతాన్ని గుర్తు చేసే విధంగా వుందే కానీ ఎక్కడా కొత్తగా కనిపించలేదని నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు.
బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'అఖండ'లోని అఖండ పాత్ర ఓ రేంజ్ లో ఎలివేట్ కావడానికి తమన్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. ఆ ఫీల్ మణిశర్మ సంగీతంలో మాత్రం 'ఆచార్య' ట్రైలర్ లో కనిపించలేదని, ఈ విషయంలో తమన్ ని నమ్ముకోకుండా చిరు రాంగ్ స్టెప్ వేశారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. మరి కొంత మంది మాత్రం సినిమా చూస్తే కానీ మణిశర్మ విషయంలో చిరు మిస్టేక్ చేశారా? లేదా అన్నది తెలుస్తుందిని అంటున్నారట. ఇప్పటికే బారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని ఏప్రిల్ 29న భారీ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు.