Begin typing your search above and press return to search.
సుమన్ ఇష్యూపై ఘాటుగా రియాక్ట్ అయిన చిరు!
By: Tupaki Desk | 12 Jan 2023 9:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన మూసీవ్‌యాక్షన్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య'. చాలా ఏళ్ల వింటేజ్ లుక్ లో ఊర మాస్ పాత్రలో చిరంజీవి నటించిన మూవీ ఇది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబి దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. దాదాపు 22 ఏళ్ల క్రితం చిరుతో కలిసి అన్నయ్య' మూవీలో నటించిన మాస్ మహారాజా రవితేజ ఇన్నేళ్ల విరామం తరువాత ఈ మూవీలో కీలక అతిథి పాత్ర చేశాడు.
జనవరి 13న భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. సినిమా ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. మరి కొన్ని గంటల్లో యుఎస్ ప్రీమియర్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ముచ్చటించారు. అంతే కాకుండా పలు మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానల్స్ కి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ఓ మీడియాకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేయడం, సీనియర్ నటుడు, అలనాటి హీరో సుమన్ ఇష్యూపై ఘాటుగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఒకానొక దశలో చిరంజీవి స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో సుమన్ జైలు పాలు కావడానికి చిరంజీవే కారణం అంటూ పుకార్లు వినిపించాయి.
దీనిపై తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి ఘాటుగా స్పందించారు. చిరుని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి 'సుమన్ బ్లూ ఫిల్మ్ కేసు' గురించి స్పందించమని కోరడంతో ముందు చిరు నిరాకరించినా ఆ తరువాత అసలు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.
ఛీ..ఛీ..ఛీ.. ఇలాంటి వాటికి ఆన్సర్ ఇవ్వడం కూడా నాకు చాలా ఇబ్బందికరంగా వుంది. నేను, సుమన్ మంచి స్నేహితులం, మధ్యలో ఎవడో పోరంబోకు జర్నలిస్ట్ ఏదో రాశాడు.. పోరంబోకు అనే మాట హార్ష్ గా వుండొచ్చు కానీ వాడు ఏదో రాశాడా.. రాసిన దాన్ని వక్రీకరించాడో కానీ ఇప్పటికీ వందలసార్లు సుమన్ ఏం లేదని చెప్పాడు. ఆయనకి నాకు ఎలాంటి విరోదం లేదు. ఇప్పటికీ మేం మాట్లాడుకుంటుంటాం, సుమన్ నేను 80వ దశకం బ్యాచ్ రీ యూనియన్ లో కలుస్తాం.. మాట్లాడుకుంటాం.
కానీ వీళ్లు మాత్రం శాడిస్టులా మాట్లాడుతుంటారు. పదే పదే ఇవే విమర్శలు చేస్తుంటారు. ఇలాంటి వాటిపై మాట్లాడుకోవడం సిగ్గు చేటు. ఏ తప్పు చేయని వాడిపై ఆరోపణలు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నా నుంచి ఎవరూ ఏ తప్పు పట్టలేరు. ఇలాంటివి సాగదీస్తూ వెళ్లినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు' అంటూ ఘాటుగా స్పందించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.