Begin typing your search above and press return to search.

బాల‌య్యకు ప‌న్ను మిన‌హాయింపుపై చిరు స్పంద‌న!

By:  Tupaki Desk   |   11 Jan 2017 7:08 AM GMT
బాల‌య్యకు ప‌న్ను మిన‌హాయింపుపై చిరు స్పంద‌న!
X
టాలీవుడ్ టాప్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన వందో చిత్రానికి ల‌భించిన ప‌న్ను మిన‌హాయింపుపై మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరు ఆస‌క్తిక‌రంగా ఉంది. బాల‌య్య త‌న వందో చిత్రంగా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి రేపు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. చ‌రిత్ర‌కు సంబంధించిన ఈ చిత్రానికి ప‌న్ను మిన‌హాయించాల‌ని బాల‌య్య‌... తెలంగాణ సీఎం కేసీఆర్‌ను స్వ‌యంగా అభ్య‌ర్థించారు. బాల‌య్య విజ్ఞ‌ప్తికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్‌... అక్క‌డిక‌క్క‌డే జీవో జారీ చేయించారు. ఆ త‌ర్వాత తెలంగాణ బాటలోనే పయ‌నించిన ఏపీ కూడా బాల‌య్య చిత్రానికి ప‌న్ను మిన‌హాంపును ఇస్తూ... రెండు రోజుల క్రితం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

చ‌రిత్ర‌ను త‌ర్వాతి త‌రాల‌కు తెలియ‌జేబుతున్నందునే ఈ చిత్రానికి ప‌న్ను మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు చంద్ర‌బాబు స‌ర్కారు ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. దాదాపు టాలీవుడ్‌కు తొమ్మిదేళ్లు దూరంగా ఉన్న చిరు.... త‌న 150వ చిత్రంగా ఖైదీ నెంబ‌రు 150 ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం నేటి ఉద‌యం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైపోయింది. ఈ క్ర‌మంలో నిన్న ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌ కు వ‌చ్చిన ఇంట‌ర్వూలో ఆయ‌న ప‌లు అంశాల‌పై మాట్లాడారు. బాల‌య్య చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు... ప్ర‌త్యేకించి ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన ప‌న్ను మిన‌హాయింపు పైనా ఆయ‌న నోరు విప్పారు.

‘‘గత చరిత్రను చూపించే సినిమాలకు రాయితీలు ఇవ్వడమనేది మంచిదే. అయితే ‘రుద్రమదేవి’కి కూడా ఇచ్చున్నట్లయితే గనక మరింత న్యాయం చేసినట్లయ్యేది. రుద్రమదేవి కూడా ఓ చరిత్రకు సంబంధించిన సినిమానే. గుణశేఖర్‌ గారు కోట్లు ఖర్చుపెట్టి చేసిన సినిమా. దానికి తెలంగాణలో పన్ను మినహాయింపు లభించింది కానీ, ఆంధ్రాలో లభించలేదు. ఆ సినిమాకిచ్చి, ఈ సినిమాకీ ఇచ్చుంటే.. ‘ఓహో.. ఈ తరహా సినిమాలకు ప్రోత్సాహకాలు లభిస్తాయ’ని అనుకోవచ్చు. దానికి ఇవ్వకపోవడం, దీనికి మాత్రం ఇవ్వడం విమర్శకు తావిస్తోంది’’.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/