Begin typing your search above and press return to search.
బాలయ్యతో పోటీపై చిరు ఏమంటారంటే?
By: Tupaki Desk | 7 Jan 2017 5:33 AM GMTఈ సంక్రాంతికి పందెం కోళ్లలాగా చిరంజీవి - బాలకృష్ణ చిత్రాలు పోటీ పడుతున్నాయి. పైపెచ్చు ఆ రెండూ కూడా మైలురాయిల్లాంటి సినిమాలు. ఒకరిది 150వ సినిమా - మరొకరిది 100వ సినిమా. అందుకే అభిమానులు ఈ రెండింటినీ స్పెషల్ గా చూస్తున్నారు. రెండు సినిమాలకీ - ఇద్దరు హీరోలకీ మధ్య పోటీ పెట్టి మాట్లాడుకొంటున్నారు. స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న ప్రతిసారీ ఇలాంటివి మామూలే. అయితే ఈసారి రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు విడుదల అవుతుండడంతో అభిమానుల మధ్య పోటీ వాతావరణం మరింతగా పెరిగింది.
అయితే వాటిని చేసిన కథానాయకులు మాత్రం స్నేహ మంత్రం జపిస్తుండడం విశేషం. చిరంజీవి - బాలకృష్ణ... ఈ ఇద్దరూ కూడా మా రెండు సినిమాలే కాదు, పండక్కి విడుదలయ్యే మిగతా సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకొంటున్నాం అని చెబుతున్నారు. ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణితో పోటీ గురించి స్పందించారు. ``పోటీ అనేది నాకు ఎప్పుడూ లేదు. అయితే నా 150వ సినిమా - బాలకృష్ణ 100వ సినిమా ఒకే సారి విడుదలవుతుండడంతో పోటీని మీడియా క్రియేట్ చేసింది. మేమిద్దరం కూడా ఒకేసారి ఇలా ప్లాన్ చేయలేదు. కాకతాళీయంగా జరిగిపోయిందంతే`` అన్నారు చిరు. బాలయ్యతో ఉన్న ఈక్వేషన్స్ గురించి కూడా చిరు మాట్లాడాడు. ``బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఓపెనింగ్ కి కూడా నేను వెళ్లా. ఆ సినిమాకి నేను కెమెరా స్విచ్చాన్ చేశా. అలాంటి కథాంశాల్ని ఎంచుకోవడమే సగం సక్సెస్. నా మిత్రుడైన బాలకృష్ణ సినిమా సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొంటున్నా. పండక్కి వచ్చే మిగతా అన్ని సినిమాలూ బాగా ఆడాల``న్నారు. అభిమానులూ విన్నారు కదా...!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/