Begin typing your search above and press return to search.
ఓ దివ్యానుభూతి -చిరంజీవి
By: Tupaki Desk | 10 Feb 2017 5:06 AM GMTఅక్కినేని నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ చిత్రం ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరైన మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జునతో కలిసి మూవీ చూశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఓం నమో వేంకటేశాయ చిత్రంపై తన స్పందనను తెలియచేశారు చిరు.
'ఓం నమో వేంకటేశాయ చూడడం నాకు ఓ అద్భుతమైన అనుభవం. భక్తి ప్రపత్తులు పెల్లుబుకుతాయ్, అందులో ఎలాంటి సందేహం అవసరంలేదు. ముఖ్యంగా సెకండాఫ్ అయితే చాలా హృద్యంగా ఉంది. సెకండాఫ్ అంతా నా కళ్లు చెమరుస్తూనే ఉన్నాయ్. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి కిందకు రావడం.. భక్తుడి కేరక్టర్ తో వెంకన్న కళ్యాణం జరిపించడం దగ్గర నుంచి చివరి వరకూ సినిమా అత్యద్భుతంగా ఉంది. ఈ సినిమా ఒక ఎమోషనల్ ట్రావెల్ లా ఉంది' అన్నారు మెగాస్టార్.
'ఇంత చక్కటి తియ్యాలంటే అది రాఘవేంద్ర రావు గారు.. చెయ్యాలంటే మా మిత్రుడు నాగార్జున.. అలాంటి సినిమా తెరకెక్కించాలంటే మహేష్ అంతే. గతంలో అన్నమయ్య.. శ్రీరామదాసు.. షిరిడీ సాయి ఎన్నో వచ్చాయి.. వాటికి ధీటుగా ఈ సినిమా ఉంది
నాగార్జున కెరీర్ కి ఇదో కలికితురాయి. రాఘవేంద్రరావు అత్యద్భుతంగా తీశారు. నటీనటులు.. సాంకేతిక నిపుణులు చక్కని పనితీరు కనబరిచారు. ఈ సినిమా చూడడం ఓ దివ్యానుభూతి' అంటూ ఓం నమో వేంకటేశాయపై ప్రశంసలు కురిపించారు చిరంజీవి.