Begin typing your search above and press return to search.
కత్తి కోసం చిరు టీం రివర్స్ కేస్??
By: Tupaki Desk | 11 May 2016 12:31 PM GMTమెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కత్తి అనే విషయం తెలిసినా.. ఈ మూవీ ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. జూలై నుంచి రెగ్యులర్ షెడ్యూల్స్ ప్లాన్ చేయగా.. ఈ మూవీకి సంబంధించిన స్టోరీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కథ నాదంటూ తెరపైకి వచ్చిన రైటర్ తో చర్చలు సుఖాంతం కాలేదని అంటున్నారు.
అసలీ వివాదాన్ని ఓ సారి చూస్తే.. ఒకవేళ స్టోరీ కాపీ అన్నది నిజమే అయితా.. ఇలా కొట్టినది తమిళ కత్తిని రూపొందించిన మురుగదాస్. ఆ చిత్రాన్ని తీసిన నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.. ఫుల్ ప్లెడ్జెడ్ గా డబ్బు చేసేసుకుంది. వాళ్లను ఏమీ చేయలేకపోయిన ఈ రైటర్.. చిరంజీవితో ఈ సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించగానే హంగామా మొదలుపెట్టేశాడు. అక్కడికీ ఈ వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించానికి చిరంజీవి ప్రయత్నించారట. తనకు డబ్బుతో పాటు రైటర్ క్రెడిట్ కూడా అడిగిన డిమాండ్ ను కూడా పరిశీలించారట మెగాస్టార్.
అయితే.. చిరు 150వ సినిమా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కావడంతో... భారీ మొత్తంలో డిమాండ్ చేసేస్తున్నాడట. దీంతో ఇతన్ని పక్కన పెట్టేసి సినిమా స్టార్ట్ చేసేయాలని భావిస్తున్నారని అంటున్నారు. అసలు ఆ రైటర్ అడుగుతున్న దానిలోనే లీగల్ పాయింట్ సరిగా లేదనే వాదన వినిపిస్తోంది. అసలు సినిమా తీసినవాళ్ల దగ్గర తేల్చుకోకుండా రీమేక్ రైట్స్ కొన్నవారిని డిమాండ్ చేసే అవకాశం ఇతగాడికి ఏ మాత్రం లేదన్నది టాక్. అక్కడికీ ఎంతోకొంత ఇద్దామని అనుకుంటే.. ఇతను ఏకంగా 2-3 కోట్లు అడుగుతున్నాడని తెలుస్తోంది.
ఈ వివాదం ఇంకా తెమలకపోవడంతో.. ఇప్పటికే సినీ వర్కర్స్ అసోసియేషన్ వాళ్లు చిరంజీవి కత్తికి సహకరించబోమని నోటీసు ఇవ్వడం మరింతగా అగ్గి రాజేసింది. ఓ రైటర్ వచ్చి ఏదో మాట్లాడినంత మాత్రాన.. ఏ పాయింట్ ప్రకారం సినిమా షూటింగ్ ను అడ్డుకుంటారని.. కొణిదెల ప్రొడక్షన్స్ తరఫున కేసు పెట్టేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మరోవైపు జూలై నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేయడం అయితే పక్కా అంటున్నారు. మొదట కొన్ని పాటలను ఇతర రాష్ట్రాల్లో తీస్తారట.
అసలు ఈ వివాదం మొత్తంలో మెగాస్టార్ అండ్ కో కి మండించిన విషయం మరొకటి ఉంది. సమస్య పరిష్కారం కోసం వినాయక్ ప్రయత్నిస్తే... వినాయక్ నాతో మాట్లాడాడంటూ సదరు రైటర్ పేపర్లకు ఇంటర్యూలు ఇవ్వడం చిరంజీవి అండ్ టీంని బాగా ఇరిటేట్ చేసిందని టాక్. మొత్తానికి కొణిదెల ప్రొడక్షన్ అరంగేట్రంలోనే వర్కర్స్, రైటర్స్ పై ఎదురుకేసులు పెట్టాలని నిర్ణయించడం ఆశ్చర్యకరమే.