Begin typing your search above and press return to search.
కౌబాయ్ లా వచ్చి రకుల్ ని కాపాడేశాడా?
By: Tupaki Desk | 1 Oct 2015 1:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమా ఏది అనేది ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. అయితే అంతకంటే ముందే చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ చిత్రంలో ఓ అతిధి క్యారెక్టర్ లో కనిపించేందుకు చిరు రెడీ అయ్యారు. ఇటీవలే హైదరాబాద్ హైటెక్స్ పరిసరాల్లో ఓ కౌబోయ్ సెట్ లో ఫైటింగ్ సీన్ తెరకెక్కించారు. ఈ ఫైట్ సన్నివేశంలో మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించారట. కథానాయిక రకూల్ ప్రీత్ ని రౌడీల నుంచి కాపాడే సన్నివేశంలో చిరు రియల్ గ్యాంగ్ లీడర్ ని తలపించాడన్న సంగతి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నా ఆ పిక్ చూస్తే తెలిసిపోతోంది. మెగాస్టార్ చాలా స్టయిలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. టైట్ ఫిట్ జీన్స్ - బ్లాక్ కోట్ - రేబాన్ కళ్లద్దాలు. ఆ లుక్కే వేరుగా కనిపిస్తోంది. అర చెయ్యి చూపించి.. రఫ్ గా ఉంది రఫ్ఫాడించేస్తా.. అన్నట్టే కనిపిస్తున్నాడు చిరు.
చిరు ముఖానికి రంగేసుకుని ఇప్పటికే ఐదేళ్లు అయ్యింది. చివరి సారి రామ్ చరణ్ మగధీరలో కనిపించాడు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇంతకాలానికి మరోసారి ముఖానికి రంగేసుకుని సెట్స్ లో మళ్లీ అంతే ఎనర్జిటిక్ గా కనిపించారని యూనిట్ చెబుతోంది. అయితే బ్రూస్లీ చిత్రంలో కేవలం యాక్షన్ ఎపిసోడ్ లో మాత్రమే చిరు కనిపిస్తారు. అతడు చరణ్ తో కలిసి ఓ పాటకు స్టెప్పులేస్తారని, తనతో పాటే ఐటెమ్ భామ నర్తిస్తుందని అప్పట్లో వార్తలొచ్చినా అవేవీ నిజాలు కావని యూనిట్ చెబుతోంది. ఇక పోతే చిరంజీవి నటించే 150వ సినిమా రేసులో నేనింకా ఉన్నా నంటూ పూరి జగన్నాథ్ వ్యాఖ్యానించాడు. 150 కుదరకపోతే 151 చేస్తా. నేను చిరంజీవికి సిసలైన అభిమానిని. ఆ హక్కు నాకు ఉంది అంటూ పూరి కామెంట్ చేశాడు. అదీ సంగతి.