Begin typing your search above and press return to search.
నేను అమ్మ గర్భంలో ఉన్నప్పుడు రిక్షా బోల్తాపడింది: చిరంజీవి
By: Tupaki Desk | 15 May 2023 8:00 AM GMTఎన్టీఆర్- ఏఎన్నార్ పరిశ్రమకు రెండు కళ్లుగా ఉండేవారు. ఆ తర్వాతి జనరేషన్ లో సూపర్ స్టార్ కృష్ణ- శోభన్ బాబు- కృష్ణంరాజు- మురళీమోహన్ - చంద్రమోహన్- సుమన్- భానుచందర్.. ఇలా ఎందరో హీరోలు సినీరంగాన్ని ఏలారు. అయితే ఎందరు హీరోలు ఉన్నా కొణిదెల హీరో చిరంజీవి టాలీవుడ్ (అప్పట్లో మద్రాసీ పరిశ్రమ) లోకి వచ్చాక సన్నివేశం వేరుగా మారింది.
ఆయన తనదైన హార్డ్ వర్క్ డ్యాన్సింగ్ స్కిల్స్ తో పరిశ్రమలో ఎదురే లేని మాస్ హీరోగా రారాజుగా ఎదిగారు. కమర్షియల్ సినిమాని ఓ మలుపు తిప్పిన మేటి శిఖరంగా ఆయన దశాబ్ధాల పాటు టాలీవుడ్ ని ఏలారు.
అయితే చిరంజీవి 30 వయసులో ఉన్నప్పుడు నటనలో శిక్షణ తీసుకుని సినీఆరంగేట్రం చేసాక చాలా హార్డ్ వర్క్ చేశాకే.. అటుపై పెద్ద స్టార్ గా ఎదిగారు. అప్పటికి నలభైలు వచ్చాయి. సుప్రీంహీరోగా మెగాస్టార్ గా ఆయన కాలక్రమంలో రూపాంతరం చెందిన తీరు ఎంతో ప్రత్యేకమైనది. హిట్లు.. బ్లాక్ బస్టర్లు ..ఇండస్ట్రీ హిట్లు.. మ్యాసివ్ హిట్లు.. అపరిమిత అసాధారణ రికార్డులు ఆయన సొంతం. ఇప్పటికీ 60 ప్లస్ ఏజ్ లో ఆయన ఇంకా టాలీవుడ్ లో తన ఛరిష్మా ఎక్కడా తగ్గకుండా హార్డ్ వర్క్ తో రాణిస్తున్నారంటే అర్థం చేసుకోవాలి.
అయితే ఆయన చిరంజీవిగా ఇంత పెద్ద స్టార్ గా ఎదగడం అన్నది దైవలిఖితం. ఆ మాటను చిరు కాస్త అటూ ఇటూగా నేటి మదర్స్ డేని పురస్కరించుకుని ప్రముఖ మీడియాతో ఓ చాటింగ్ సెషన్ లో చెప్పారు. నాకు సినిమా జీన్స్ ఎలా వచ్చాయో నాకు తెలుసు.. అంటూనే చిరు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లారు.
ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఓ షాకింగ్ దుర్ఘటన గురించి కూడా తెలిపారు. ``మా అమ్మ అక్కినేని నాగేశ్వరరావుగారి ఫ్యాన్. తనకు సినిమాలు చూడటం అంటే ఇష్టం. నాన్న ఎస్వీఆర్ ఫ్యాన్. తనకు నటనంటే ఇష్టం. నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మ- నాన్న ఇద్దరూ `జీవితం` అనే సినిమా చూడటానికి వెళ్తున్నప్పుడు రిక్షా బోల్తా పడిపడింద``ని తెలిపారు.
అప్పుడు నిండు గర్భిణి అయిన అమ్మకు దెబ్బలు తగిలాయని రోడ్డు మీద ఉన్న వారంతా కంగారుపడ్డారట. అప్పుడే ఆ వైపు వెళ్తున్న బస్సు డ్రైవర్ కూడా వీళ్లిద్దరిని ఊర్లో దిగబెడతానన్నాడట. కానీ అమ్మ- నాన్న ఆ ఘటన నుంచి తక్షణం తేరుకొని అట్నుంచి అటే సినిమాకు వెళ్లిపోయారని... ఈ సంఘటన జరిగిన కొద్దికాలానికే నేను పుట్టాను.. అంటూ మురిపెంగా చెప్పుకొచ్చారు చిరు. సినిమా అంటే విపరీతమైన అభిమానం.. నటనంటే పిచ్చి ప్రేమ వీళ్లిద్దరి(అమ్మా నాన్న) నుంచే నాకు అబ్బాయని కూడా చిరు తెలిపారు. మొత్తానికి సూపర్ స్టార్ ఆవిర్భావం యాక్సిడెంటల్ గానే.. తల్లి గర్భంలోనే జరిగిందన్నది ఇప్పుడు మెగాభిమానులకు తెలిసిన అసలు సిసలు సత్యం.