Begin typing your search above and press return to search.

చనిపోయిన హీరో కటౌట్‌ తో ఆయన భార్య శ్రీమంతం

By:  Tupaki Desk   |   5 Oct 2020 11:30 PM GMT
చనిపోయిన హీరో కటౌట్‌ తో ఆయన భార్య శ్రీమంతం
X
కన్నడ నటుడు చిరంజీవి అకాల మరణం ఆయన అభిమానులతో పాటు సినిమా పరిశ్రమ వారందరికి కూడా కన్నీరు పెట్టించింది. యాక్షన్‌ కింగ్‌.. స్టార్‌ హీరో అర్జున్‌ మేనల్లుడు అయిన చిరంజీవి సర్జా జూన్‌ లో మృతి చెందాడు. భార్య మేఘనా రాజ్‌ మూడు నెలల గర్బవతిగా ఉన్న సమయంలో చిరంజీవి మృతి చెందారు. ఆ విషయం మరింతగా జనాలకు ఆవేదన కలిగించింది. మేఘనా రాజ్‌ శ్రీమంతం వేడుకను తాజాగా కుటుంబ సభ్యులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరు అయ్యారు.

శ్రీమంతం కార్యక్రమంలో చిరంజీవి లేని లోటు తెలియకూడదు అనే ఉద్దేశ్యంతో ఆయన కటౌట్‌ ను ఏర్పాటు చేశారు. మేఘన పక్కన నిజంగా చిరంజీవి నిల్చున్నాడా అన్నట్లుగా కటౌట్‌ ఉంది. సోషల్‌ మీడియాలో ఈ ఫొటోలు ఆయన సన్నిహితులు షేర్‌ చేయడంతో అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు. చిరంజీవి లేని లోటును ఆయన కుటుంబ సభ్యులకు ఎవరు తీర్చలేరంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. మేఘన కడుపున మళ్లీ చిరంజీవి పుట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. 2018లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. చిరంజీవి మరియు మేఘనా లు ఎనిమిది ఏళ్లు ప్రేమించుకుని రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఇంతలోనే దారుణం జరిగిపోయింది.