Begin typing your search above and press return to search.

చిరు చిన్న కూతురి పెళ్లి డేట్ ఇదే

By:  Tupaki Desk   |   19 Feb 2016 6:12 AM GMT
చిరు చిన్న కూతురి పెళ్లి డేట్ ఇదే
X
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతుర శ్రీజ పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యారేజ్ డేట్ విషయంలోనూ, వెన్యూ విషయంలోనూ కన్ఫ్యూజన్ ఉంది. ఫిబ్రవరి చివర్లో పెళ్లి జరగుతుందని, చెన్నైలో వేడుక చేయనున్నారని అనుకున్నారు. అయితే.. ఇప్పుడీ విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. చిరు ఇంట పెళ్లి బాజాలు కరెక్టే కానీ.. పెళ్లి ముహూర్తం మాత్రం మార్చ్ 28న ఫిక్స్ చేశారు.

కూతురు పెళ్లి విషయంలో చిరంజీవి చాలా సంతోషంగా ఉన్నారని.. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి చేస్తారని అంటున్నారు. అది కూడా హైద్రాబాద్ లోనే ఈ వేడుక జరగనుంది. హైద్రాబాద్ వ్యాపార వేత్త కెప్టెన్ కిషన్ కుమారుడు కళ్యాణ్.. శ్రీజకు వరుడు. చిరంజీవి భార్య సురేఖ, కెప్టెన్ కిషన్ భార్య చాలాకాలంగా స్నేహితులు. అలా ఈ సంబంధం కుదురిందని తెలుస్తోంది. ఈ రెండు కుటుంబాలకు ముందు నుంచే అనుబంధం ఉండడం.. మరోవైపు కళ్యాణ్ - శ్రీజలకు చాలా కాలం నుంచే పరిచయం ఉండడంతో.. ఈ పెళ్లి ప్రపోజల్ వచ్చిందట.

ఇక చిరుకు కాబోయే చిన్న అల్లుడు కళ్యాణ్ ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో బాగానే చక్కర్లు కొడుతోంది. అవునా కాదా అనే సందేహాలు ఉన్నా.. ఇప్పుడు అతడే అసలైన వరుడు అని తేల్చేశారు దగ్గరి బంధువులు. ఈ వివాహం పట్ల రెండు కుటుంబాలు అత్యంత సంతోషంగా ఉన్నాయి. ఇద్దరి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా మార్చ్ 28న పెళ్లి వేడుక జరగనుంది.