Begin typing your search above and press return to search.
చిరుకు 'చల్లగా' దీవించే వేదికే కావాలి
By: Tupaki Desk | 5 March 2016 5:07 AM GMTమెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు పెళ్లికి డేట్ దగ్గరవుతోంది. మార్చ్ 28న పెళ్లి వేడుకను వైభవంగా జరిపేందుకు నిర్ణయించారు. అయితే, ఇప్పటివరకూ వివాహ వేదిక సెటిల్ కాలేదని తెలుస్తోంది. నిజానికి ఈ పెళ్లిని హైద్రాబాద్ లో కాకుండా డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ తో చేద్దామని నిర్ణయించారు. ఇందుకోసం జైపూర్ - ఉదయ్ పూర్ లలోని రాజ ప్రాసాదాలను కూడా కన్సిడర్ చేశారు.
రీసెంట్ గా చిరు పెద్ద కూతురు సుస్మిత ఈ ప్రాంతాలను సందర్శించడం పూర్తయింది. మేరేజ్ ఈవెంట్ నిర్వహించే సంస్థ చూపించిన వేదికలు నచ్చినా.. ఈ ప్రాంతం చాలా వేడిగా ఉంటుందనే విషయం ఆమె గ్రహించింది. ఇదే విషయాన్ని ఫ్యామిలీకి కూడా చేరవేసిందామె. చిరు కూతురు పెళ్లి అంటే.. తరలివచ్చే సెలబ్రిటీలు వేలాదిగా ఉంటారు. అందుకే ఈ ప్రాంతంలో పెళ్లి జరపాలనే నిర్ణయాన్ని డ్రాప్ చేసుకున్నారు చిరు.
ఏవైనా చల్లని ప్రదేశాల్లో చిన్న కూతురు పెళ్లి నిర్వహించాలని చిరంజీవి భావిస్తున్నారని.. సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రదేశాలను పరిశీలిస్తున్నారని.. రెండు మూడు ఆప్షన్స్ ఉండగా.. వీటిలో ఏదో ఒకటి త్వరలోనే ఫైనల్ చేయనున్నారని తెలుస్తోంది. పెళ్లికి వచ్చినవాళ్లంతా చల్లగా ఉండమని దీవించడమే కాదు.. వారు కూడా చల్లగా ఉండాలి కదా. అందుకే ఈ కూల్ ఏరియా కోసం సెర్చింగ్ అన్నమాట.