Begin typing your search above and press return to search.

యంగ్ డైరెక్టర్ కు షాకిచ్చిన మెగాస్టార్..?

By:  Tupaki Desk   |   14 Oct 2022 11:30 AM GMT
యంగ్ డైరెక్టర్ కు షాకిచ్చిన మెగాస్టార్..?
X
ఇటీవల కాలంలో వరుస సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ మధ్య యువ దర్శకుడు వెంకీ కుడుములతో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై RRR నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ మెగా ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

'ఛలో' 'భీష్మ' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ.. స్వతహాగా చిరంజీవి కి వీరాభిమాని. కేవలం రెండు సినిమా అనుభవం ఉన్న దర్శకుడికి.. మెగా ఆఫర్ రావడంతో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసాడని అందరూ అనుకున్నారు. దీంతో వెంకీ టాప్ డైరెక్టర్స్‌ లిస్టులో చేరతాడని భావించారు.

చిరంజీవి తన డైరెక్షన్‌ లో పని చేయాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేయడమే కాకుండా.. వెంకీ చెప్పిన బేసిక్ స్టోరీని కూడా ఇష్టపడ్డాడు. ఈ నేపథ్యంలో అధికారికంగా ప్రాజెక్ట్ ని ప్రకటించారు. తన ఫేవరేట్ హీరోతో వర్క్ చేసే అవకాశం రావడంతో భీష్మ దర్శకుడు ఎంతో ఉత్సాహంగా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

అయితే మెగా ఆఫర్ అలా వచ్చినట్లే వచ్చి చేజారిపోయినిందని.. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ఇటీవల తన మీడియా ఇంటరాక్షన్‌ లో, తాను వెంకీ కుడుముల చిత్రాన్ని టేకప్ చేయడం లేదనే విషయాన్ని ధృవీకరించినట్లుగా నివేదికలు ఉన్నాయి.

నిజానికి ఈ చిత్రాన్ని అఫిషియల్ గా ప్రకటించారే కానీ.. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ రాలేదు. అప్పుడే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కష్టమనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇప్పుడు వెంకీ ఫైనల్‌ స్క్రిప్ట్‌ బిగ్ బాస్ కు నచ్చకపోవడంతో ఈ చిత్రాన్ని పక్కన పెట్టినట్లుగా ఇన్‌సైడ్‌ టాక్ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు వెంకీ కుడుములఇతర హీరోలను సంప్రదించనున్నాడని అంటున్నారు. కాకపోతే ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలదరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు వెంకీ కథను ఓకే చేసినా.. ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కావాలంటే చాలా సమయం పడుతుంది.

'భీష్మ' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు.. అప్పటి నుంచి మెగాస్టార్ మూవీ మీదనే హోప్స్ పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్లీ నితిన్‌ ని సంప్రదించనున్నారని టాక్ నడుస్తోంది. అంతేకాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను మెప్పించాలని చూస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి.

ఏదేమైనా బ్యాక్ టూ బ్యాక్ రెండు సూపర్ హిట్లు అందుకున్న వెంకీ కుడుముల.. ఇప్పటి వరకూ తన తదుపరి చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి టాలెంటెడ్ డైరెక్టర్ త్వరలోనే మరో మంచి సినిమాతో వస్తాడేమో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.