Begin typing your search above and press return to search.
సీఎం జగన్ పై చిరంజీవి ప్రశంసల వర్షం.. కారణమిదే
By: Tupaki Desk | 22 Jun 2021 10:37 AM GMTటాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి అందరి సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వంతో.. సీఎం జగన్ తో సఖ్యతతో ఉంటున్నారు. తమ్ముడు పవన్ బీజేపీతో జట్టుకట్టి జగన్ పై విరుచుకుపడుతున్నా.. చిరంజీవి మాత్రం జగన్ చేసే మంచి కార్యక్రమాలను అభినందిస్తూనే ఉన్నారు.
ఏపీలో షూటింగ్ ల దగ్గర నుంచి సినిమాలకు ఏ అడ్డంకి లేకుండా చిరంజీవి ఏపీ ప్రభుత్వంతో సఖ్యతతో వ్యవహరిస్తున్నారు. థియేటర్లకు కరోనా వేళ ఆక్యూపెన్సీ, టికెట్ రేట్లు సహా బెనిఫిట్ షోలకు ఇబ్బందులు కలుగుకుండా చూసుకున్నారు. చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా ఇప్పుడాయన ఆ బాధ్యత తీసుకున్నారు. సీఎం జగన్ కూడా చిరంజీవిని స్వయంగా సన్మానించారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరోజులో ఏకంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం అద్భుతమన్నారు. దీనిపై మెగా స్టార్ చిరంజీవి స్పందించారు. ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.
'ఆంధ్రప్రదేశ్ వైద్యసిబ్బంది ఒకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం ఓ గొప్ప కార్యం.. దీనిపట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా.. వైద్యసిబ్బంది కృషి ఫలితంగా కోవిడ్ భూతాన్ని ఓడించగలమనే విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఈ ప్రయత్నాలను కొనసాగించాలి. జగన్ ది స్ఫూర్తిదాయక నాయకత్వం.. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నా' అని చిరంజీవి ప్రశంసిస్తూ జగన్ కోసం ట్వీట్ చేశాడు.