Begin typing your search above and press return to search.

చిరు అల్లుడికీ అలాంటి కోరికలున్నాయా?

By:  Tupaki Desk   |   22 Feb 2016 3:30 PM GMT
చిరు అల్లుడికీ అలాంటి కోరికలున్నాయా?
X
టాలీవుడ్ లో ప్రస్తుతం వారసుల హవా నడుస్తోంది. ప్రతి ఫ్యామిలీ నుంచి బోలెడుమంది హీరోలు తెరమీదికి వచ్చేశారు. మెగాస్టార్ ఫ్యామిలీనే తీసుకుంటే అక్కడ ప్రస్తుతం ఎనిమిది మంది హీరోలున్నారు. త్వరలోనే సాయిధరమ్ తేజ్ తమ్ముడు కూడా సినిమాల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఐతే త్వరలోనే చిరు ఫ్యామిలీలోకి అడుగుపెడుతున్న మరో కొత్త వ్యక్తి కూడా సినిమాల్లోకి వస్తాడేమో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు జనాలు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. చిరంజీవి చిన్న కూతురు శ్రీజను పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ్. ఈ కుర్రాడి ఫీచర్స్ హీరో కావడానికి తగ్గట్లుగా ఉండటం కూడా ఈ అనుమానాలకు తావిస్తోంది.

కళ్యాణ్ లుక్స్ చూస్తుంటే అతడికి హీరో అయ్యే లక్షణాలున్నట్లు కనిపిస్తోంది. అతడికి కూడా సినిమాల్లోకి వచ్చే ఆసక్తి ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పడు హీరోల ఫ్యామిలీ నుంచి కొడుకులు, రక్త సంబంధీకులే హీరోలుగా వచ్చేవాళ్లు కానీ.. సుధీర్ బాబు కొత్త సంప్రదాయానికి తెర తీశాడు. అల్లుళ్లు కూడా హీరోలు కావచ్చని నిరూపించాడు. అదే బాటలో కళ్యాణ్ కూడా త్వరలోనే హీరో అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ సంగతలా ఉంచితే.. శ్రీజ, కళ్యాణ్ ల వివాహానికి మెగా ఫ్యామిలీలో జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లికి పరిమిత సంఖ్యలోనే అతిథులు వస్తున్నప్పటికీ.. వేడుక మాత్రం ఘనంగానే చేయబోతున్నారు.