Begin typing your search above and press return to search.

చిరు అల్లుడింట పార్టీ అదుర్స్..

By:  Tupaki Desk   |   27 March 2016 1:30 PM GMT
చిరు అల్లుడింట పార్టీ అదుర్స్..
X
మెగా ఫ్యామిలీలోకి కొత్త సభ్యుడి రాకకి ముహూర్తం ఫిక్స్ అయింది. ఇప్పటికే చిరు చిన్న కూతురు శ్రీజ - ఆమె స్నేహితుడు శ్రీజల పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. పెళ్లికొడుకు - పెళ్లి కూతురులుగా చేసే ఫంక్షన్లు కూడా పూర్తయిపోయాయి. ఇక పెళ్లికి రెండు రోజులు మాత్రమే ఉందనగా.. పెళ్లికొడుకు కళ్యాణ్ తల్లిదండ్రులు ఓ భారీ పార్టీ ఏర్పాటు చేశారు.

కళ్యాణ్ పేరెంట్స్ అయిన కెప్టెన్ కిషన్ - జ్యోతి బంజారా హిల్స్ లోని తమ సొంత ఇంట్లో ఇచ్చిన ఈపార్టీకి దాదాపు రెండు ఫ్యామిలీల్లోని ముఖ్యులంతా జంటలుగా హాజరయ్యారు. చిరంజీవి-సురేఖ - చరణ్-ఉపాసన - అల్లు అర్జున్-స్నేహలు జంటలుగా వస్తే అల్లు శిరీష్ - సాయిధరం తేజ్ - నీహారిక సహా ఇతర ముఖ్యులుగా ఈ ఈవెంట్ కు విచ్చేశారు. అయితే ఈ వేడుకలో పెళ్లి కూతురు శ్రీజ మాత్రం కనిపించలేదు. ఆచారం ప్రకారం పెళ్లికూతురును చేశాక.. మళ్లీ పీటలపై వరకూ పెళ్లికొడుకును అమ్మాయి చూడకూడదు. అందుకే శ్రీజ ఈ పార్టీలో కనిపించలేదు.

కానీ కళ్యాణ్ మాత్రం అందరితో భలేగా కలిసిపోయాడని తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ - అల్లు అర్జున్ లతో అయితే.. ఈ కుర్రాడు చేసిన హంగామా అంతా ఇంతా కాదని అంటున్నారు. మొత్తం 150మంది అతిథులు హాజరుకాగా.. మంగోలియన్ - ఇటాలియన్ - చైనీస్ - ఇండియన్ ఫుడ్స్ తో ఈ పార్టీ అత్యద్భుతంగా సాగిందని సమాచారం.