Begin typing your search above and press return to search.
సినిమా గొప్పతనమేంటన్నది నాకు అప్పుడు తెలిసింది: మెగాస్టార్
By: Tupaki Desk | 1 Sep 2022 3:59 AM GMTపూర్ణోదయా క్రియేషన్స్ బ్యానర్ గతంలో ఆణిముత్యాల వంటి సినిమాలు వచ్చాయి. ఆ తరువాత ఈ బ్యానర్ గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా ఇదే బ్యానర్లో 'ఫస్టు డే ఫస్టు షో' సినిమాను నిర్మించింది. వంశీధర్ - లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కథను అందించాడు. శ్రీకాంత్ రెడ్డి - సంచిత బషు ఈ సినిమాతో నాయకా నాయికలుగా పరిచయమవుతున్నారు. ఈ నెల 2వ తేదీన థియేటర్లకు ఈ సినిమా రానుంది.
ఈ నేపథ్యంలో చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరిగింది. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ .. "ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడానికి కారణం మా ఏడిద నాగేశ్వరరావు గారు. ఆయన ఆశీస్సులు ఇక్కడ ఉన్న వాళ్లందరికీ ఉంటాయని నమ్ముతున్నాను. ఏడిద నాగేశ్వరరావుగారితో నాకు సినిమా పరమైన అనుబంధమే కాదు ... సినిమాయేతర అనుబంధం కూడా ఉంది. నేను ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసి మెలిసి తిరిగేవాడిని.
తమ సినిమాల్లో ఎవరు నటిస్తున్నా వాళ్లను తమ సొంత మనుషులుగా భావిచడం వారికి అలవాటు. వారితో నాకు గల వ్యక్తిగత అనుబంధం వల్లనే ఈ ఈవెంట్ కి వచ్చాను. పూర్ణోదయా చాలా గర్వించదగిన సంస్థ. ఏడిద నాగేశ్వరరావుగారు తమ అభిరుచికి తగినట్టుగానే విశ్వనాథ్ గారి కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించారు. శంకరాభరణం .. సాగర సంగమం .. స్వాతిముత్యం .. స్వయం కృషి ... ఆపద్బాంధవుడు ఆ జాబితాలో మనకి కనిపిస్తాయి.
ఈ ఈవెంటుకి రావడం వాళ్లకంటే నాకు ఎంతో సంతోషాన్ని .. సంతృప్తిని ఇస్తుంది. కొన్ని ఫంక్షన్స్ కి మొక్కుబడిగా వెళుతుంటాము .. కొన్నిటికి ప్రేమతో వెళుతుంటాము. అలా ప్రేమతో వచ్చిన ఫంక్షన్ ఇది. సినిమా పరిశ్రమ అనేది చాలా గొప్పది. నా జీవితంలో నేను ఇక్కడే ఎదుగుతూ వచ్చాను .. నా జీవితమంతా ఇక్కడే జరుగుతూ వచ్చింది. ఆ తరువాత మరొక రంగానికి వెళ్లి అక్కడి నుంచి తిరిగి వచ్చేశాను. వచ్చేసిన తరువాత సినిమా విలువ నాకు మరింత ఎక్కువ తెలిసింది.
ఏ మాత్రం టాలెంట్ ఉన్నప్పటికీ వెంటనే అక్కున చేర్చుకునే పరిశ్రమ ఇది. అలాంటి పరిశ్రమలో నేను ఈ స్థానాన్ని సంపాదించుకున్నందుకు నా జన్మ సార్థకం అయిందని అనుకుంటున్నాను. ఈ పరిశ్రమలో ఒక భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పట్టుదలతో కష్టపడ్డవాళ్లంతా ఇక్కడ పైకి వచ్చారు. అనుకుంటే వచ్చేస్తాం అనుకుని లైట్ తీసుకున్నవాళ్లని ఇండస్ట్రీ కూడా అంతే తేలికగా తీసుకుంటుంది. దాంతో వాళ్లు వెనక్కి వెళ్లిపోవడానికి అది దారి అవుతుంది" అంటూ చెప్పుకొచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.