Begin typing your search above and press return to search.
ఇలా రచ్చకెక్కితే 'మా' సొంత బిల్డింగ్ కడతారా?
By: Tupaki Desk | 2 Jan 2020 11:05 AM GMTదాదాపు 900 మంది ఆర్టిస్టులు ఉన్న అతి పెద్ద సంఘం `మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్`. దశాబ్ధాల పాటు `మా` కార్యకలాపాలు విజయవంతంగా సాగడమే గాక ఎంతో హుందాగా సాగాయి. కోట్లాది రూపాయల నిధిని సేకరించే సత్తా ఉన్న అసోసియేషన్ ఇది. అన్నీ సవ్యంగా సాగితే ఈపాటికే సొంత భవంతిని నిర్మించుకోవాల్సింది. కానీ ఇక్కడ ఏదో లోపం ఆ పనిని జరగనివ్వలేదన్న సందేహాలున్నాయి. అవేమిటి? అన్నది సినీ పెద్దలకు చాలా స్పష్టంగా తెలుసు. గత అధ్యక్షుల స్వార్థ రాజకీయాలు స్వయంకృతం ఒక కారణం అనుకుంటే.. ఇటీవలి కాలంలో మూవీ ఆర్టిస్టుల సంఘంలో నిప్పు ఉప్పులా మారిన రాజకీయాలు.. వివాదాల రచ్చ మరింత దిగజార్చిన వైనం ప్రత్యక్షంగా మీడియా ముఖంగా బయటపడుతోంది. ఓవైపు సినీ పెద్దలు గొడవల్ని చల్లార్చాలని ప్రయత్నిస్తున్నా పరిష్కారం అన్నదే లేకుండా పోయిందన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేడు మా డైరీ ఆవిష్కరణ రసాభాసను టీవీ చానెళ్ల లైవ్ లో చూసిన జనం విస్తుపోవాల్సిన పరిస్థితి.
ఇక ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి - కృష్ణంరాజు- మోహన్ బాబు అంతటి వారే మా పరువు తక్కువ పనులపై ఆవేదన వెల్లగక్కారు. వివాదాల రచ్చకు చిర్రెత్తి పోయారు. కలిసి వెళదాం.. అంతర్గతంగా పరిష్కారం కావాలి అని పదే పదే మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆవేదనగా వారించే ప్రయత్నం చేసినా ఎవరూ ఆయన మాట వినలేదు.
అంతేకాదు.. ప్రస్తుతం పని చేస్తున్న కమిటీలో వివాదాల రచ్చ వల్లనే మా అసోసియేషన్ సొంత భవంతి నిర్మించుకోవడం సాధ్యపడలేదని చిరు ఈ మీటింగ్ లో ఆవేదన వ్యక్తం చేశారు. వివేదాల్ని పక్కన పెట్టి పరిష్కారం కావాలని కోరారు. అంతేకాదు.. అసోసియేషన్ భూమి కోసం మంత్రి కేటీఆర్ ను రిక్వెస్ట్ చేశానని... కుమ్ములాటలు.. అంతర్గత విభేదాల కారణంగా అది వాయిదా పడిందని చిరు వెల్లడించడం సభ్యుల్లో చర్చకు వచ్చింది.
అంతేకాదు తమిళ పరిశ్రమలో నడిగర సంఘం గొప్పగా నిధిని సేకరించి పేద ఆర్టిస్టులకు ఇళ్లు కట్టించి ఇస్తున్నారనే విషయం తెలుసుకోని ఈర్ష పడ్డానని చిరు అన్నారు. సంఘంలో లుకలుకల వల్లనే మనం పురోగతిని సాధించలేకపోయామని ప్రస్తుత కమిటీలో వివాదాలపై తనదైన శైలిలో చురకలు అంటించే ప్రయత్నం చేశారు. సంఘంలో మంచి విషయాలు ఉంటే మైక్‌లో చెప్పుకొందాం. చెడు విషయాలు ఉంటే చెవిలో చెప్పుకొందాం. విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగుదాం అని చిరంజీవి మా సభ్యులకు సూచించారు.