Begin typing your search above and press return to search.
చిరంజీవి 'పాజిటివ్' స్పీచ్ అదిరిందిలే
By: Tupaki Desk | 8 April 2017 5:31 AM GMTమెగాస్టార్ చిరంజీవితో ''అందరివాడు'' సినిమా తీశాడు శ్రీను వైట్ల. ఆ తరువాత రామ్ చరణ్ తో ''బ్రూస్ లీ''. ఈ రెండూ డిజాష్టర్లే. అందుకే ఇప్పుడు ''మిష్టర్'' ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో ఒకవేళ చీఫ్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి ఏమైనా చురకలు వేస్తారేమోనని కాస్త కంగారుపడ్డారు అందరూ. కాని మెగాస్టార్ మాత్రం తన పాజిటివిటీని మరోసారి
''వరుణ్ తేజ్ కు చెప్పేది ఒకటే.. వెనకాల మేమందరం ఉన్నాం.. ఆ వెనుక అభిమానులు ఉన్నారు.. అనే భావనతో కాకుండా ప్రతీ సినిమాకు కొత్త సినిమాలా ఫస్టు సినిమాలా కష్టపడి పనిచేయాలనే చెప్పాం. కష్టాన్ని నమ్ముకుంటే అభిమానులు ఎలాగో రెడీమేడ్ గా ఉన్నారు'' అని చెప్పారు వరుణ్ తేజ్. చాలా కాలిక్యులేటెడ్ గా వరుణ్ జాగ్రత్తగా సినిమాలు ఒప్పుకుంటున్నందుకు అభినందించారు చిరంజీవి. అలాగే ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జి.. ఠాగూర్ మధులకు సినిమాలపై చాలా అవగాహన ఉందని.. వారు నిర్మించడమే సగం సక్సెస్ అని పేర్కొన్నారు.
''అసలు శ్రీను వైట్ల అంటే నాకు చాలా ఇష్టం. కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. అటువంటి కామెడీ టింజ్ ఉన్న డైరక్టర్ శ్రీను వైట్ల అంటే చాలా ఇష్టం. అందరివాడు టైములో మా కెమిస్ర్టీ బాగా కుదిరింది. ఆ తరువాత ఆయన డైరక్షన్లో చేయడం కుదర్లేదు. కాని ఈ మధ్యనే బ్రూస్ లీ సినిమాలో ఒక క్యామియో వేయాలని పట్టుబట్టాడు వైట్ల. నన్ను నేను మరోసారి రీ-ఎంట్రీ సమయంలో తెరమీద చూసుకునే అవకాశం ఇచ్చి.. అబ్బా మనం పర్లేదు.. అనే ఫీలింగ్ నాకు తెచ్చాడు. తను తీసిన ఢీ.. రెడీ.. దూకుడు సినిమాలు చాలా బాగుంటాయి. ఈ సినిమా కూడా అలాగే హిట్టవుతుందని ఆశిస్తున్నాను'' అంటూ డైరక్టర్ గురించి చెప్పారు చిరంజీవి. ఈ సినిమాతో శ్రీను వైట్ల తనేమిటో నిరూపించుకునే ఛాన్సు ఉందని.. నిరూపించుకోవాలని సూచించారు.
ఇక మ్యూజిక్ డైరక్టర్ మిక్కి.జె.మేయర్ పాటలు కూడా చాలా సాఫ్ట్ గా బాగుంటాయని.. క్లాస్ టచ్ ఉన్న మ్యూజిక్ డైరక్టర్ ఇప్పుడు మాస్ లో బీట్ ఓరియెంటెడ్ పాటలు ఇచ్చినందుకు అభినందించారు చిరంజీవి. కథ రాసిన గోపిమోహన్.. డైలాగ్స్ రాసిన శ్రీధర్ సీపాన.. హీరోయిన్లు లావణ్య త్రిపాఠి.. హెబ్బా పటేల్.. అందరినీ అభినందించారు మెగాస్టార్. వాటే పాజిటివ్ స్పీచ్ గురూ!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/