Begin typing your search above and press return to search.
నా కష్టం పేమెంట్.. వీడిది పెయిన్ - చిరు
By: Tupaki Desk | 2 Oct 2015 6:28 PM GMTరామ్ చరణ్ మూవీకి.. బ్రూస్ లీ అనే టైటిల్ ఎందుకు పెట్టారు ? అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ - చరణ్ కేరక్టరైజేషన్ కారణంగానే.. శ్రీనువైట్ల - రామ్ చరణ్ ఈటైటిల్ ని ఎంచుకున్నారని అంటున్నారు మెగాస్టార్ ? బ్రూస్ లీని టార్గెట్ సెట్ చేసుకుని తీయడం - ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటించి షూటింగ్ నిర్వహించడాన్ని ప్రశంసించిన చిరు.. ఆ టార్గెట్ అందుకోవడంలో ప్రతీ ఒక్కరి కష్టం ఉందన్నారు. డైరెక్టర్ శ్రీనువైట్ల - రైటర్స్ కోన వెంకట్ గోపీమోహన్ లు - నిర్మాత దానయ్య - హీరో రామ్ చరణ్ లతో పాటు.. టెక్నీషియన్స్ అందరి కష్టంతోనే.. ఈ అక్టోబర్ 16 రిలీజ్ టార్గెట్ అందుకోగలుగుతున్నారని చెప్పారు.
" ఎంటర్ ది డ్రాగన్ చాలా సార్లు చూశాను, నేను ఎక్కువసార్లు చూసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. బ్రూస్ లీ ఒక లెజెండ్ " అన్న మెగాస్టార్.. హీరో, డైరెక్టర్ అయ్యప్ప దీక్ష తీసుకుంటే.. యూనిట్ మొత్తం మనో దీక్షతో పని చేస్తున్నారని ప్రశంసించారు. "గత 15 రోజులుగా... రోజుకు 17-18 గంటలు కష్టపడుతున్నాడు చరణ్. అది చూసి ఎందుకు నాన్నా ఇంత కష్టపడుతున్నావ్. ఫైట్స్, డ్యాన్స్ లు అన్నీ ఒకసారే ఎందుకు అని అడిగింది వాళ్లమ్మ. అప్పు చరణ్ డాడీ కష్టం చూసిన నువ్వే ఇలా మాట్లాడితే ఎలాగమ్మా అని అడిగాడు"అన్నారు చిరంజీవి.
తల్లి ప్రశ్నకి, కొడుకు సమాధానం సూపర్ గా ఉంటే.. దీనికి తాను ఇంకో మంచి డైలాగ్ వేశానని చెప్పారు. ''డాడీ కష్టం చూస్తే మమ్మీకి పేమెంట్ గుర్తొస్తుంది.. అదే కొడుకు కష్టం చూస్తే తల్లికి పెయిన్ గుర్తొస్తుందంటూ..'' మంచి పంచ్ వేసిన చిరు.. ఇది నవ్వులాటగానే అన్నారు. సినిమా ఫుల్ మీల్స్ పెట్టినట్లు ఉంటుందని.. నా ఎంట్రీ ఈ సినిమాలో కొసమెరుపు లాంటిదని చెప్పారు. భోజనం చేశాక ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుందో.. తన రోల్ అంత స్పీట్ గా - థ్రిల్లింగ్ గా ఉంటుందన్నారు చిరు. సినిమాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన శ్రీను వైట్ల - కోన వెంకట్ - గోపి మోహన్, కొరియోగ్రాఫర్లు జాని - శేఖర్ - లిరిసుస్టలతో పాటు.. హిట్ సంగీతం అందించిన థమన్ ను కూడా అభినందించారు. ''ఏదో చరణ్.. వైట్ల.. అయ్యప్ప దీక్ష తీసుకోవడం కాదు.. సినిమా యునిట్ అంతా ఒక దీక్షలాగా పనిచేస్తూ.. ఈ అవుట్ పుట్ ను అందిస్తున్నారు. నేను భరోసా ఇస్తున్నా ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది.. మిమ్మల్ని అలరిస్తుంది'' అని చెప్పుకొచ్చారు.
ఇకపోతే.. 150వ సినిమా గురించి చెబుతూ.. ''కథ కోసం ఎదరుచూస్తున్నామని చెప్పట్లేదు.. పూర్తి స్థాయి 150వ సినిమా వచ్చేస్తోంది. త్వరలోనే చరణ్.. సురేఖ.. మీకు ఆ విషయాలను తెలియజేస్తారు. బ్రూస్ లీ రిలీజ్ కు కాస్త ముందు.. లేకపోతే ఒక 15 రోజుల్లో మీకు తెలుస్తుంది'' అంటూ సెలవు తీసుకున్నారు చిరంజీవి.