Begin typing your search above and press return to search.
స్టేజ్ మీద ఓపెనైపోయిన చిరు..
By: Tupaki Desk | 24 Aug 2015 4:16 AM GMTమెగాస్టార్ చిరంజీవి గత మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపీ పార్టీలలో పాల్గొంటూ వస్తున్నాడు. ఫిలింఫేర్ రేంజ్ లో మొన్న అట్టహాసంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరిగిన తరువాత కూడా ఏ మాత్రం అలసట చెందకుండా నిన్న తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమా ఆడియో వేడుకకు విచ్చేశాడు.
ఈ సందభంగా మాట్లాడుతూ మా కాలంలో రామానాయుడు, అశ్వినీదత్, త్రివిక్రమరావు వంటి నిర్మాతలు ఎంతటి నిబద్ధతతో పనిచేసి సినిమాను ప్రేమించేవారో ఈ కాలంలో అలాంటి ప్రేమే దిల్ రాజులో చూస్తున్నానని తెలిపాడు. తన 150వ సినిమా ఆయనే నిర్మిస్తే బాగుంటుందని భావించాడట. ఇక మిక్కీ స్వరపరిచిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద పాటలు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.
ఇక దర్శకుడి ప్రతిభను పేర్కొంటూ ఈ కాలంలో తనకి బాగా నచ్చిన చిత్రం గబ్బర్ సింగ్ అని, ఆ సినిమాను నేను అభిమానినని, ఆ సినిమా చూస్తున్నప్పుడు ఏదొక చిన్న స్వార్ధం వచ్చిందని "ఇది మనకి పడాల్సిన సినిమా.. ఇలాంటి సినిమా గనుక పడితే ఇరగదీసేవాడ్ని కదా" అని మనుసులో చాలాసార్లు అనుకున్నానని ఓపెన్ అయిపోయాడు చిరు. తాను కమ్ బ్యాక్ కి తయారై వున్నానని, మీరే కధని తయారుచేసుకుని రండని స్టేజ్ మీద యువదర్శకులకు సవాల్ విసిరాడు.