Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌ పంచేశారా.. నిజం చెప్పారా?

By:  Tupaki Desk   |   20 July 2015 3:39 PM GMT
మెగాస్టార్‌ పంచేశారా.. నిజం చెప్పారా?
X
నిన్నటిరోజున టీఎస్సార్‌ అవార్డుల వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి స్పీచ్‌ చాలా మందిని చాలా రకాలుగా ఆలోచింపజేసింది. అంతగా ఆలోచింపజేసేలా ఎంచి ఎంచి పదాల్ని తెలివిగా 'పంచ్‌'లోకి చేర్చారు చిరు. ఆ స్పీచ్‌ లో సారంశం ఏమంటే..

''నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు ఇవ్వడం అంటే అది పేరు తేవడానికో, సంతృప్తి పరచడానికో కాదు. బాధ్యత మరింత పెరిగింది అని చెప్పడానికి. డెడికేషన్‌ తో ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చెయ్యమని చెప్పడానికి''. అయితే దీన్ని అన్వయించుకుంటే ఎలా అర్థమైందంటే.. 'అసలు నటించడం రాని మొహాలకు ఎందుకు ఈ అవార్డులు. ఇకముందైనా బాగా నటించండి' అని చెప్పడమే దీని వెనక ఉద్ధేశం అని అర్థం చేసుకోవాల్సి వచ్చింది.

చిరు ఆ మాట ఎవరిని ఉద్ధేశించి అన్నా అది నేరుగా టీఎస్సార్‌ కి, అవార్డులు అందుకున్న వారికి తగిలి ఉండాలి. అయితే చిరు యాథృచ్ఛికంగా అన్నా.. దాని సారాంశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పనికొచ్చే విషయమే ఉంది. ఎలాగూ అవార్డులు అంటే వేడుకకు అటెండ్‌ అయ్యేవారికి ఇచ్చేవే అనే అర్థం ఎలానూ ఉంది. కాబట్టి ఈ కామెంట్ల గురించి పెద్దగా వర్రీ కానక్కర్లేదు లెండి.