Begin typing your search above and press return to search.
అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు!
By: Tupaki Desk | 21 Nov 2021 5:09 AM GMT60 ప్లస్ ఏజ్ లో మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ నేటితరానికి స్ఫూర్తి అనడంలో అతిశయోక్తి లేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్.. చిరంజీవి.. రజనీకాంత్ లాంటి టాప్ స్టార్లు వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేయడం అభిమానులకు ఆశ్చర్యకరమే.
ప్రస్తుతం చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆచార్య చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నారు. మరో మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇంతలో చిరంజీవి మరో చిత్రానికి అనుమతి ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై సోషల్ మీడియాలో ప్రతికూల ప్రతిస్పందనలు ఎదురయ్యాయి.
ఛలో- భీష్మ- రంగ్ దే చిత్రాల దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. మెగాస్టార్ ను హ్యాండిల్ చేసేంత అర్హత దర్శకుడికి లేదని మెగా అభిమానులు ఈ ఎంపిక గురించి ఆందోళన చెందుతున్నారు. నాగశౌర్య- నితిన్ వంటి యువ హీరోలకు మాత్రమే దర్శకత్వం వహించిన అనుభవం ఉంది.. అని విశ్లేషిస్తున్నారు.
అంతేకాదు.. ఈ సినిమాలో చిరంజీవి సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవికి రష్మిక సూటబుల్ కాదనేది ఒక అభిప్రాయం. అయితే అంతర్జాలంలో వచ్చేవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. మరీ అంత సరిపోలని కాంబినేషన్లతో చిరు సినిమాలు చేయరు.
ఆయన అనుభవం విశ్లేషణ వేరు. ఇక దర్శకుడి ఎంపిక విషయంలో కూడా చిరు ఎంతో ఆలోచించి కానీ నిర్ణయించరు. ఇటీవల వరుసగా ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశాలివ్వడం కూడా విమర్శలకు తావిచ్చింది. అయితే ఫ్లాప్ డైరెక్టర్లను సరి చేసి దారికి తెచ్చే అనుభవం కూడా చిరు సొంతం.
అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు! అయినా దర్శకుడు ఎంపిక చేసుకున్న కథ- స్క్రిప్టు మెప్పిస్తే అప్పటికే విజయవంతమైన సినిమాలు చేసి నిరూపిస్తే అవకాశం ఇవ్వడం తప్పు కాదు. కానీ నెటిజనుల్లో రకరకాల సందేహాలు పుట్టుకు రావడం సహజం. వాటికి చిరు ఆన్సర్లు ప్రాక్టికల్ గా మాత్రమే ఉంటాయని అభిమానులు విశ్లేషిస్తున్నారు.