Begin typing your search above and press return to search.
చేతికట్టుతో జిమ్ చేస్తున్న శంకర్ దాదా
By: Tupaki Desk | 15 Feb 2016 9:29 AM GMTఒక చేత్తో కొట్టడం - కాలు నేల మీద పెట్టకుండా ఫైట్ చేయడం, ముట్టుకోకుండా కొడతాననడం.. మెగాస్టార్ సినిమాల్లో ఇలాంటి ఫీట్స్ చాలానే ఉంటాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇదే స్టైల్లో.. ఒక చేత్తోనే జిమ్ చేసేస్తున్నారు. అఫ్ కోర్స్.. వ్యాయామం కోసం కాదు లెండి. ఓ జిమ్ సెంటర్ ఓపెనింగ్ లో భాగంగానే ఇలా చేయాల్సి వచ్చింది.
ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి చిరంజీవికి పర్సనల్ ట్రైనర్. తన ఫిట్నెస్ కు సంబంధించి.. మెగాస్టార్ ఈయన్నే ప్రిఫర్ చేస్తారు. ఏళ్ల తరబడి ప్రవీణ్ కి- చిరంజీవికి అనుబంధం ఉంది. ఇప్పుడాయన హైద్రాబాద్ మణికొండలో రాగాస్ ప్లెక్స్ జిమ్ పేరుతో ఓ అధునాతన జిమ్ సెంటర్ ఓపెన్ చేశాడు. దీని ప్రారంభోత్సవానికి మెగాస్టార్ ని ఆహ్వానించగానే.. ఉత్సాహంగా వచ్చేశారు చిరు. ప్రస్తుతం ఆయన భుజానికి ఆపరేషన్ చేయించుకుని, రెస్ట్ తీసుకుంటున్నా జిమ్ ఓపెనింగ్ రావడం విశేషం.
మరి జిమ్ వరకూ వచ్చాక.. వర్కవుట్స్ చేయకపోతే ఎలా? అందుకే.. ఓ పావు గంట సేపు అన్ని పరికరాలను పరిశీలించి, ఓ ట్రయల్ వేశారాయన. అది కూడా ఓ చేతికి కట్టు కట్టుకునే కావడం విశేషం. ప్రస్తుతం ప్రతీ చోటా చిరు ఇలా చేతి కట్టుతోనే కనిపిస్తున్నారు. కూతురు పెళ్లి పనుల్లోనూ, రాజమండ్రి ఎయిర్ పోర్టులోను, ఇప్పుడు జిమ్ సెంటర్ లోనూ.. చేతి కట్టుతోనే వెళ్లిపోతున్నారు శంకర్ దాదా.