Begin typing your search above and press return to search.
తొమ్మిదేళ్ల తర్వాత చిరు మళ్లీ..
By: Tupaki Desk | 11 Oct 2016 11:29 AM GMTమెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీకి సమయం దగ్గర పడుతోంది. ఇంకో మూడు నెలల్లోనే ఆయన 15వ0 సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. రీమేక్ కాబట్టి ఈ సినిమా కథేంటన్నది ఆల్రెడీ చాలామందికి తెలిసిందే. సినిమా ఎలా ఉండొచ్చు అనే విషయంలో ఒక అంచనాలున్నాయి. చిరు లుక్ ఆల్రెడీ బయటికి వచ్చేసింది. ఆయన ఎలా కనిపిస్తాడన్న విషయంలోనూ ఓ క్లారిటీ ఉంది. మరి సినిమాకు సంబంధించి అత్యంత ఎగ్జైట్ చేసే అంశం ఏంటంటే.. చిరు డ్యాన్సులే అన్న విషయంలో సందేహాలు అక్కర్లేదు. ఇప్పుడనే కాదు.. గతంలోనూ చిరంజీవి సినిమా అంటే అభిమానులు అత్యంత ఆసక్తిగా గమనించేది ఆయన డ్యాన్సుల్నే.
ఐతే తొమ్మిదేళ్ల విరామం వచ్చింది. పైగా వయసు 60 దాటిపోయింది. ఈ తరుణంలో చిరు డ్యాన్సులు ఎలా చేస్తాడు అని అందరిలోనూ ఉత్కంఠ ఉంది. ఐతే చిరంజీవి ఈ విషయంలో బాగానే ప్రిపేరయ్యే ఉంటాడనడంలో సందేహం లేదు. తాజా సమాచారం ఏంటంటే.. ‘ఖైదీ నెంబర్ 150’ పాటల చిత్రీకరణ మొదలైపోయింది. చిరు సుదీర్ఘ విరామం తర్వాత ఫ్లోర్ మీద అదరగొట్టడానికి రెడీ అయిపోయాడు. చిరు.. కేథరిన్ థ్రెసా మీద ఒక పాట చిత్రీకరణ మొదలుపెట్టేశాడట వినాయక్. సినిమాలకు గుడ్ బై చెప్పేశాక చిరు మగధీర.. బ్రూస్ లీ లాంటి సినిమాల్లో క్యామియోలు చేశాడు. ‘బ్రూస్ లీ’లో ఫైట్ కూడా చేశాడు. కానీ ఆయన డ్యాన్సులకు మాత్రం అభిమానులు ముఖం వాచిపోయి ఉన్నారు. మరి చిరు ఏ రేంజిలో డ్యాన్సులేస్తున్నాడో.. అభిమానులు ఎలా అలరించబోతున్నాడో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/