Begin typing your search above and press return to search.

ఆటోబయోగ్రఫీ మీద ఫోకస్ పెట్టిన మెగాస్టార్...?

By:  Tupaki Desk   |   19 July 2020 10:13 AM GMT
ఆటోబయోగ్రఫీ మీద ఫోకస్ పెట్టిన మెగాస్టార్...?
X
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల 'ఆచార్య' షూటింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన చిరంజీవి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసి సినీ కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేసారు. ఇక సినిమా షూటింగ్స్ మళ్ళీ రీ స్టార్ట్ చేపించడానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి అనుమతులు వచ్చేలా చొరవ తీసుకున్నారు. అయితే రోజురోజుకి కరోనా తీవ్రత ఎక్కువ అవుతుండటంతో రిస్క్ తీసుకోవడం ఎందుకని సినిమా షూటింగ్స్ ప్రారంభించడం లేదు. దీంతో ఈ సమయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆత్మ‌క‌థ రాసుకోవ‌డానికి ఉప‌యోగించుకుంటున్నారట.

ఇండస్ట్రీలో ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా అడుగు పెట్టి స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. ఆయన కథ తెలుసుకోవాలని ప్రతి సినీ అభిమానికి ఉంటుంది. స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల ఆటోబయోగ్రఫీలు బియోపిక్స్ గా వస్తున్న నేపథ్యంలో చిరు ఆటోబయోగ్రఫీ కూడా సినిమాగా రాబోతోందని వార్తలు వచ్చాయి. అయితే చిరు తన సక్సెస్ ఫుల్ జర్నీని డాక్యుమెంటరీగా తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర కూడా డాక్యుమెంటరీ డ్రామాగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు కూడా తన ఆటోబయోగ్రఫీని డాక్యుమెంటరీ డ్రామాగా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇక దీనికి తగ్గట్టే చిరు తన ఆటోబయోగ్రఫీ కోసం కొంతమంది సినీ జర్నలిస్టులతో కలిసి ఆయనకి సంబంధించిన ఓల్డ్ వీడియోలు ఫోటోలు కలెక్ట్ చేసే పనిలో ఉన్నారట. అంతేకాకుండా అప్పట్లో మెగాస్టార్ తో కలిసి వర్క్ చేసిన నటీనటులు మరియు దర్శకనిర్మాతల వీడియో బైట్స్ కూడా తీసుకుంటున్నారట. వీటిని రైటింగ్ టీమ్ బుక్ లో పొందుపరుస్తున్నారట. మొత్తం మీద త్వరలోనే చిరంజీవి ఆటోబయోగ్రఫీ రానుందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆటోబయోగ్రఫీ మరి డాక్యుమెంటరీ వార్తలు విని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.