Begin typing your search above and press return to search.

హింట్ ఇచ్చారుగా.. అల్లుకుపోండి

By:  Tupaki Desk   |   22 Aug 2015 5:22 AM GMT
హింట్ ఇచ్చారుగా.. అల్లుకుపోండి
X
చిరంజీవి 150వ సినిమా. ఇప్పటికీ నారింజ మిఠాయిలా ఊరిస్తూనే వుంది. దీనికోసమే గత ఏడేళ్ళుగా మెగా అభిమానులు ఆశగా చూస్తున్నారు. 150వ సినిమా చేస్తున్నారని అధికారికంగా ప్రకటించడంతో ఎవరితో చేస్తారో ఎలాంటి సినిమా అని ఓ కన్నేస్తూనే ఈ సినిమాకి మొదలైన నాటినుండి వంద రోజుల పండగ వరకూ ఏమేం చేయాలో ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మొన్న జరిగిన ఫోటో షూట్ చూసిన వారి కళ్ళల్లో ఆనందాన్ని ఎలా వెల కట్టగలం. నేడు చిరు జన్మదినం సందర్భంగా ఆ ముచ్చటేదో తెలుసుకుందామనుకుంటే అది తీరేలా లేదు.

ఇంతమంది దర్శకులున్నా పూరికే ఓటేశారు చిరు. స్వతహాగా ఫ్యాన్ అని చెప్పుకున్న ఈ దర్శకుడు మాత్రం సగం వండి వెళిపోయారు. మిగతా సగం ఎప్పటికి పూర్తవుతుందో. తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో చిరు ఓ మంచి కబురు చెప్పారు. పూరి అని మడి గట్టుకు కూర్చోలేదు. ఎవరు మంచి కథతో వస్తారో వాళ్ళతోనే అని. అంతేకాకుండా ఓ హింట్ కూడా ఇచ్చారు. రీఎంట్రీ సినిమా శంకర్ దాదా ఎంబిబిఎస్ లా కామెడీ టచ్ సినిమా చేయాలనుందని తన మనసులో మాట చెప్పుకొచ్చారు. ఇంత చెప్పాక కూడా మన రచయిత, దర్శకులు ఊరకుండడం అస్సలు మంచిది కాదు. హింట్ ఇచ్చారుగా... అల్లుకుపోండి.. నూట యాభైవ సినిమాపై టైటిల్ వేసుకోండి. ఆల్ ది బెస్టు..