Begin typing your search above and press return to search.
సునీల్ ప్రాణాలు కాపాడిన చిరు మాట
By: Tupaki Desk | 21 April 2019 4:47 AM GMTకొన్నిసార్లు చిన్న సలహాలు మాటలు ఏకంగా ప్రాణాలు రక్షిస్తాయి . అది ముందుగా ఊహించనిది అయితే దానిలో థ్రిల్ మాటల్లో చెప్పడం కూడా కష్టమే. అలాంటి అనుభవాన్నే సునీల్ ఇటీవల పంచుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ని జోరుగా సాగిస్తున్న సునీల్ ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన సంఘటన పంచుకున్నాడు.
ఠాగూర్ షూటింగ్ జరుగుతున్నప్పుడు సునీల్ తన స్వస్థలం అయిన భీమవరం వెళ్ళాల్సి వచ్చింది. స్పాట్ లో ఉన్న హీరో తాను అన్నయ్యగా భావించే చిరంజీవికి చెప్పి వెళ్దామని కారవాన్ దగ్గరికి వెళ్ళాడు. సునీల్ ని సీట్ బెల్ట్ పెట్టుకోమని జాగ్రత్త గా ప్రయాణం చేయమని చెప్పి చిరు విష్ చేశాడు. సాధారణంగా సీట్ బెల్ట్ అప్పుడప్పుడు మర్చిపోయే అలవాటు సునీల్ కు ఉంది
అన్నయ్య అందులోనూ చిరు స్వయంగా చెప్పాడు కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా సునీల్ సీట్ బెల్ట్ పెట్టుకుని భీమవరంకు కారులో బయలుదేరాడు. కట్ చేస్తే మార్గం మధ్యంలో ఊహించని విధంగా యాక్సిడెంట్. సునీల్ కారు నాలుగు పల్టీలు కొట్టింది. సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల సునీల్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయట పడ్డాడు. లేకపోతే ఆ రోజే ప్రాణాలు హరీమనేవి.
ఇది గుర్తు చేసుకున్న సునీల్ ఆ రోజు అన్నయ్య సలహా వినడం వల్లే ప్రాణాలు నిలుపుకున్నానని ఆ రకంగా కూడా ఆయన సాయం దక్కిందని చెప్పాడు. ఈ ఉదాహరణ గమనిస్తే సీటు బెల్టు ఎంత ముఖ్యమో అర్థమవుతోంది కదూ. పైకి చిన్న విషయంగా కనిపించినా గతంలో కొందరు ప్రముఖులు కేవలం ఈ కారణంగానే ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు మర్చిపోకూడదు