Begin typing your search above and press return to search.
ప్రభాస్ చిరులను వేరుగా చూశారా?
By: Tupaki Desk | 26 Sep 2019 6:00 AM GMTబాలీవుడ్ వరస చూస్తుంటే ఇదే ప్రశ్న మెదులుతోంది. సాహో విడుదల సమయానికి అందరూ దారిచ్చి మరీ తమ సినిమాల రిలీజులు వాయిదా వేసుకున్నారు. కానీ సైరాకు మాత్రం హృతిక్ రోషన్ వార్ ని రంగంలోకి దించి దీన్ని సాహో స్థాయిలో పరిగణించడం లేదనే హింట్ ఇవ్వకనే ఇచ్చారు. వాస్తవానికి సైరా ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. నార్త్ లో కూడా దీని మీద చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. వార్ కు ధీటుగా పోటీ ఇచ్చే కంటెంట్ సైరాలో ఉందని అక్కడి సాధారణ ప్రేక్షకులు అభిప్రాయపడినట్టు సోషల్ మీడియాలో కనిపించింది.
కానీ కొణిదెల టీమ్ అక్కడ ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడడంతో సహజంగానే వార్ వైపు కాస్త ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తోంది. అందులోనూ మల్టీ స్టారర్ కావడంతో మాస్ ప్రేక్షకులు ఎక్కువగా దాని వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో సైరా అక్కడ ఎలాంటి ఓపెనింగ్స్ సాధిస్తుందో అని అభిమానులు ఆందోళన చెందడం సహజం. ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బాలీవుడ్ ట్రేడ్ సైరాని తక్కువ అంచనా వేసి వార్ కు ఓవర్ హైప్ ఇచ్చినా మొదటిరోజు టాక్ ని బట్టి తీర్పు స్పష్టంగా వచ్చేస్తుంది.

ఇవాళ రిలీజ్ చేసిన ట్రైలర్ 2 కూడా అంత గొప్పగా లేదు. టీజర్ లాంచ్ తర్వాత సైరా టీమ్ ప్రత్యేకంగా ముంబైలో ఎలాంటి ఈవెంట్ చేయలేదు. అక్కడి మీడియా కవరేజ్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పుడు చేతిలో ఉన్న వారం రోజులను పూర్తిగా సద్వినియోగపరుచుకుని ప్రమోషన్ విషయంలో స్పీడ్ పెంచితే వార్ కు సరైన పోటీ ఇవ్వొచ్చు. చిరు ఇమేజ్ ఇక్కడ పీక్స్ లో ఉన్నప్పటికీ నార్త్ లో లేదు కాబట్టి అక్కడ ప్రభాస్ కంటే కనెక్టివిటీ విషయంలో చిరు వెనుకబడే ఉన్నారు. మరి చరణ్ టీమ్ ఇప్పటికైనా దీని గురించి ఆలోచిస్తారా