Begin typing your search above and press return to search.

సైరా: క‌్లైమాక్స్ చండ్ర‌నిప్పులే!

By:  Tupaki Desk   |   23 Oct 2018 9:17 AM GMT
సైరా: క‌్లైమాక్స్ చండ్ర‌నిప్పులే!
X
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే క్లైమాక్స్ ఎలా ఉండాలి? న‌భూతోన‌భ‌విష్య‌తి అన్న చందంగా ఉండాలి. వీరాధివీరుడు ఉయ్యాల‌వాడ నిప్పులు చెర‌గాలి. బాహుబ‌లి సిరీస్‌ క్లైమాక్స్‌ల‌ను మించి - గ్లాడియేట‌ర్ - 300 యుద్ధాల్ని మించి - ట్రాయ్‌- గ్రీకువీరుల అస‌మాన విరోచిత పోరాటాల్ని మించి ఉండాలి. ఉంటేనే జ‌నాల‌కు ఔరా! అనిపిస్తుంది. ఆ స్థాయిలో క్లైమాక్స్‌ ని `సైరా-న‌ర‌సింహారెడ్డి` టీమ్ చిత్రీక‌రించిందా? ప‌్ర‌స్తుతం ఆస‌క్తిక‌ర డిబేట్ ఇది.

దాదాపు 54 కోట్ల బ‌డ్జెట్ వెచ్చించామ‌ని చెబితే స‌రిపోదు. ఆ స్థాయి కంటెంట్‌ - వీర‌త్వం తెర‌పై క‌నిపిస్తేనే చిరంజీవి అయినా - బాల‌కృష్ణ అయినా చూసేది. ఇప్ప‌టికే బుల్లితెర‌పై 300 - గ్లాడియేట‌ర్ - ట్రాయ్ లాంటి సినిమాల్ని తెలుగు జ‌నం చూసేశారు కాబ‌ట్టి పోరాట స‌న్నివేశాల్ని క‌చ్ఛితంగా పోల్చి చూస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. జార్జియాలో ఐదు వారాల పాటు - అహోరాత్రులు శ్ర‌మించి `సైరా` పోరాట స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు. అందుకోసం ఏకంగా ఐదుగురు హాలీవుడ్ ఫైట్ కొరియోగ్రాఫ‌ర్లు - టాప్ క్లాస్ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు - సురేంద‌ర్ రెడ్డి అండ్ టీమ్ ఎంతో క‌ఠోరంగానే శ్ర‌మించార‌ని ఆన్ లొకేష‌న్ స్టిల్స్ చూస్తే అర్థ‌మ‌వుతోంది.

జార్జియాలో క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. అక్క‌డ ర‌త్న‌వేలు అండ్ టీమ్ లైవ్ ఫోటోలు కొన్ని అంతర్జాలంలో సంద‌డి చేస్తున్నాయి. భారీ కెమెరా ఎక్విప్‌ మెంట్ - క్రేన్లు వ్య‌వ‌హారం చూస్తుంటే అంతే భారీ విజువ‌ల్ ట్రీట్ కోసం అమేజింగ్ వ‌ర్క్ చేశార‌ని భావించ‌వ‌చ్చు. యుద్ధంలో క‌త్తి తిప్పాలి. గ‌న్ పేల్చాలి. బ్రిటీష్ వాళ్ల‌పై లంఘించి న‌ర‌సింహారెడ్డి విరోచిత పోరాటాలు చేయాల్సి ఉంటుంది. ఈ సీన్స్ అన్నిటినీ అమేజింగ్‌ గా తెర‌కెక్కించార‌ని చెబుతున్నారు. ఔట్‌ పుట్ విష‌యంలో సూరి అండ్ టీమ్ సంతృప్తిక‌రంగా ఉన్నార‌ట. ఇక ప‌నంతా టెక్నిక‌ల్ టీమ్‌ తోనే ముడిపడి ఉంది. భారీగా వీఎఫ్ ఎక్స్ చేయ‌డం ద్వారా వార్ ఎపిసోడ్స్‌ కి లైవ్‌ లీనెస్‌ ని తీసుకురావొచ్చు. అయితే అందుకు బాహుబ‌లిని మించి శ్ర‌మించాల్సి ఉంటుంది. క్లైమాక్స్ ఎపిసోడ్‌ లో ఓ ట్విస్టు ఉంటుంది. త‌న‌ను బంధించి శిక్షించే ఆంగ్లేయుల భ‌ర‌తం ప‌ట్ట‌డ‌మెలా అన్న‌దే ఉయ్యాల వాడ టాస్క్‌. మ‌రి ఆ పోరాటాన్ని ఏ స్థాయిలో చూపించార‌న్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. వ‌చ్చే స‌మ్మ‌ర్‌ కి ఉందిలే `సైరా` ఫెస్టివ‌ల్.